Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది ఏపీ కూలీలు మృతి!

కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది కూలీలు మృతి చెందారు. ఆదివారం రాత్రి ఎదురుగా వస్తున్న..

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది ఏపీ కూలీలు మృతి!

Road Accident

Updated On : September 13, 2021 / 9:57 AM IST

Road Accident: కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది కూలీలు మృతి చెందారు. ఆదివారం రాత్రి ఎదురుగా వస్తున్న లారీని ఓ జీపు ఢీకొట్టిడంతో ఈ ప్రమాదం జరిగింది. జీపు లారీ వేగంగా ఢీ కొట్టడంతో జీపులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది కూలీలు అక్కడికక్కడే మరణించారు.

చనిపోయిన వారంతా బ్రతుకు దెరువు కోసం ఏపీ నుండి దినసరి కూలీలగా కర్ణాటకకి వెళ్లినట్లుగా తెలిసింది. జీపు చింతామణి సమీపంలోని మరనాయకహళ్లి వద్దకు చేరుకున్న తర్వాత ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఎనిమిది మృతిచెందారు. వారిలో ఇద్దరు మహిళలు ఉండగా వారంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని కర్ణాటక పోలీసులు తెలిపారు.

మృతులంతా కూలీలని, పనులు ముగించుకుని కర్ణాటక నుండి ఏపీకి ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడగా వారిని దగ్గరలోని దవాఖానకు తరలించామన్నారు. మృతుల వివరాల కోసం ఏపీ పోలీసులకు సమాచారమిచ్చామని తెలిపారు.