ఎన్నికల కోడ్: ఢిల్లీలో 63 వేల హోర్డింగ్ లు తొలగింపు

ఢిల్లీ : దేశంలో సార్వత్రిక ఎన్నికల కు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 10 న షెడ్యూల్ ప్రకటించింది. నాటి నుంచి ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఎన్నికల నియమావళిలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రాజకీయ పార్టీలకు చెందిన 63వేలకు పైగా బ్యానర్లు, హోర్ఢింగులు, పోస్టర్లు, ఫ్లెక్సీలను తొలగించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఢిల్లీలో 6 వ విడతలో మే 12న పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన 72 గంటల్లోగా ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో ఉన్న 63వేల 449 బ్యానర్లు, హోర్ఢింగులు, పోస్టర్లు, ఫ్లెక్సీలను తొలగించినట్లు ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి తెలిపారు.
ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ పరిధిలోని 30 వేల 533 ల ప్రచార హోర్డింగ్ లను తొలగించినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలోని 3 మున్సిపల్ కార్పోరేషన్ల పరిధిలో….. ఉత్తర కార్పోరేషన్ పరిధిలో 4 వేల 945, దక్షిణ మున్సిపల్ కౌన్సిల్ పరిధిలో 22 వేల419 , తూర్పు కార్పోరేషన్ పరిధిలో 3 వేల 141 , కంటోన్మెంట్ ఏరియా పరిధిలో 2వేల 411 బ్యానర్లు, హోర్డింగులు, తొలగించినట్లు అధికారులు చెప్పారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారనే కారణంతో ఆమ్ఆద్మి, బీజేపీ పార్టీల పై ఒక్కో కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి ఒక ప్రకటనలో వివరించారు.