మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

ఝార్ఖండ్ కు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

Maharashtra, Jharkhand Elections 2024 Schedule

Updated On : October 15, 2024 / 5:35 PM IST

Maharashtra, Jharkhand Elections 2024 Schedule : మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసింది. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ప్రకటించారు. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక ఝార్ఖండ్ కు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

నవంబర్ 13న తొలి దశ, నవంబర్ 20న రెండో దశ పోలింగ్ ఉంటుంది. ఝార్ఖండ్ లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అటు 15 రాష్ట్రాల్లో 48 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల బైపోల్ షెడ్యూల్ నూ కూడా ప్రకటించింది ఈసీ. 48 అసెంబ్లీ, వయనాడ్ ఎంపీ సెగ్మెంట్ కు 13న ఓటింగ్ ఉంటుంది. వీటన్నింటి ఓట్ల లెక్కింపు నవంబర్ 23న ఉంటుంది.

కేంద్ర ఎన్నికల సంఘం రెండు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ తో పాటు దేశవ్యాప్తంగా 48 స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికల షెడ్యూల్, అలాగే 2 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికలు.. అలాగే లోక్ సభ ఎన్నికల బైపోల్ షెడ్యూల్ తో పాటుగా ఇటీవల జరిగిన జమ్ముకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఆ ఎన్నికలు జరిగిన తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ స్పందించారు.

* మహారాష్ట్ర అసెంబ్లీ టర్మ్ నవంబర్ 26న ముగుస్తుంది.
* ప్రస్తుతం మహాయుతి ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే ఉన్నారు.
* బీజేపీ, శివసేన-ఏక్ నాథ్ షిండే, ఎన్సీపీ అజిత్ పవార్ కూటమి ప్రభుత్వం ఉంది.
* మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
* మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య-18600
* మొత్తం ఓటర్ల సంఖ్య- 9.6 కోట్లు
* ఈ నెల 22న నోటిఫికేషన్ విడుదల
* ఈ నెల 29న నామినేషన్ల స్వీకరణ, 30న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 4 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
* నవంబర్ 20వ తేదీన పోలింగ్, 23న కౌంటింగ్.

* ఝార్ఖండ్ అసెంబ్లీ పదవీ కాలం జనవరి 5వ తేదీతో ముగుస్తుంది.
* ఝార్ఖండ్ ముక్తి మోర్చా-కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది.
* హేమంత్ సొరెన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
* ఝార్ఖండ్ లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
* గత ఎన్నికల్లో జేఎంఎం పార్టీ 30 సీట్లు, కాంగ్రెస్ 16 సీట్లు గెలిచాయి.
* మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య-29000
* మొత్తం ఓటర్ల సంఖ్య – 2.6 కోట్లు
* ఈ నెల 18న తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్
* ఈ నెల 22న రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్
* తొలి దశలో(నవంబర్ 13) 43 అసెంబ్లీ స్థానాలకు, రెండో దశలో (నవంబర్ 20) 38 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్
* నవంబర్ 23న ఫలితాలు విడుదల.
* గతసారి 5 విడతల్లో ఎన్నికలు జరగ్గా ఈసారి రెండు విడతల్లో పోలింగ్ పూర్తి

* దేశవ్యాప్తంగా 48 అసెంబ్లీ స్థానాలకు, 2 పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
* నవంబర్ 13న వయనాడ్ లోక్ సభ స్థానానికి పోలింగ్
* రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్ ఎంపీ సెగ్మెంట్
* వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్న ప్రియాంక గాంధీ

Also Read : టాటా గ్రూపులో వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు.. వీటికే ఫుల్ డిమాండ్!