Elections After 40 Years : అక్కడ 40 ఏళ్ల తర్వాత ఎన్నికలు.. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న 40 గ్రామాల ప్రజలు

అంతకుముందు ఈ ప్రాంతంలో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులకు సాధ్యం కాలేదు. దీంతో అక్కడి ప్రజలు ఓటింగ్ కు దూరంగా ఉండేవారు.

Elections After 40 Years : అక్కడ 40 ఏళ్ల తర్వాత ఎన్నికలు.. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న 40 గ్రామాల ప్రజలు

Chhattisgarh Bastar Elections

Updated On : October 15, 2023 / 9:45 AM IST

Elections After 40 Years – Maoist Affected Areas : ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 7,17 తేదీల్లో రెండు విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరుగున్నాయి. అయితే 90 స్థానాలకు జరుగున్న ఈ ఎన్నికల్లో ఈసారి బస్తర్ జిల్లా ప్రత్యేకను సంతరించుకుంది. మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉండే ఈ ప్రాంతంలో 40 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇక్కడి 40 గ్రామాల ప్రజలు 40 ఏళ్లలో తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

అంతకుముందు ఈ ప్రాంతంలో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులకు సాధ్యం కాలేదు.
దీంతో అక్కడి ప్రజలు ఓటింగ్ కు దూరంగా ఉండేవారు. అయితే ఈసీ ఎన్నికల ప్రకటన చేయగానే
తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు మావోయిస్టు గ్రూపులు ప్రకటించాయి. ఎన్నికల సంఘం పూర్తి భద్రతా చర్యలతో ఇక్కడ ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు ప్రారంభించింది.

Jamili Elections : జమిలి ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కాదు.. జాతీయ లా కమిషన్ కీలక ప్రకటన

దీంతో 40 ఏళ్ల తర్వాత ఇక్కడ పోలింగ్ బూత్ ల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. శనివారం నాటికి ఈ గ్రామాల్లో 120 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాంతాలను సురక్షితంగా మార్చామని, ప్రజలు తమ ఓటు హక్కును స్కేచ్ఛగా వినియోగించుకోవచ్చని అధికారులు భరోసా కల్పించారు.