Minister Amit Shah: అసోంలో అమిత్ షా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. అసలేం జరిగిందంటే?
ఈ ఏడాది త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో త్రిపురలోని అగర్తలాలో రథయాత్రను ఆ రాష్ట్ర బీజేపీ ప్లాన్ చేసింది. ఇందులో పాల్గొనేందుకు హోమంత్రి అమిత్ షా బుధవారం రాత్రి అగర్తలాకు విమానంలో బయలుదేరారు.

Amit Shah
Minister Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. త్రిపురలోని అగర్తలాకు అమిత్ షా ప్రత్యేక విమానంలో వెళ్తున్నారు. అయితే ఉన్నట్లుండి.. విమానాన్ని దారిమళ్లించారు. బుధవారం రాత్రి 10.45 గంటల సమయంలో అసోంలోని గుహవాటి లోక్‌ప్రియా గోపినాథ్ బోర్దోలాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. విమానం అత్యవసర ల్యాండింగ్ క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఎయిర్ పోర్టు వద్ద అమిత్ షాకు స్వాగతం పలికారు.
అమిత్ షా గుహవాటిలోని హోటల్ రాడిసన్ బ్లూకు వెళ్లి రాత్రి అక్కడే బసచేశారు. ఈ ఏడాది త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో త్రిపురలోని అగర్తలాలో రథయాత్రను ఆ రాష్ట్ర బీజేపీ ప్లాన్ చేసింది. ఇందులో పాల్గొనేందుకు హోమంత్రి అమిత్ షా బుధవారం రాత్రి అగర్తలాకు విమానంలో బయలుదేరారు.
Amit Shah: కర్ణాటకలో బీజేపీ ఒంటరిగానే పోరు.. వెల్లడించిన అమిత్ షా
త్రిపురలోని అగర్తలాకు అమిత్ షా వెళ్తున్న విమానం ప్రతికూల వాతావరణం కారణంగా పైలెట్లు ల్యాండింగ్ చేయలేకపోయారు. దీంతో విమానాన్ని అసోంకి మళ్లించి గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా కిందకుదించారు. అయితే, గురువారం ఉదయం అమిత్ షా అగర్తలాకు వెళ్ళనున్నారు. అక్కడ జరిగే రథయాత్రను ప్రారంభిస్తారు.