రాఫెల్ రగడ : మోడీపై కేసు పెట్టి విచారించాలి

రాఫెల్ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాఫెల్ పత్రాలు చోరీకి గురయ్యాయని బుధవారం సుప్రీంకోర్టుకి కేంద్రం తెలిపిన విషయాన్ని ప్రస్తావిస్తూ..రాఫెల్ డీల్ అవినీతి జరిగిందని మరోసారి రుజువైందన్నారు. దస్త్రాలు మాయమయ్యాయని చెప్పడం చాలు..ప్రధానిపై ఎఫ్ఐఆర్ నమోదుచేయడానికి అని రాహుల్ తెలిపారు.మోడీని కాపాడేందుకే రాఫెల్ పత్రాలు మాయం చేశారని అన్నారు. మాయమైన పత్రాల్లో నిజమే ఉందని రాహుల్ అన్నారు.
Also Read: పాక్ విమానాలు పారిపోవాల్సిందే : సెప్టెంబర్ లో భారత్ కు రాఫెల్
మాయమైన ఫైల్ లో పీఎంవో రాఫెల్ డీల్ చేసిందని ఉందన్నారు. రక్షణశాఖతో పాటు డీల్ లో పీఎంవో ఎందుకు కల్పించుకుందని రాహుల్ ప్రశ్నించారు.అన్నీ మాయం చేయడమే మోడీ పని అని రాహుల్ విమర్శించారు.రాఫెల్ పత్రాలు మాయమవడంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
విచారణ ప్రారంభమైతే..మోడీతో మొదలై మోడీతోనే ముగుస్తుందని తెలిపారు. మోడీని దోషిగా నిలబెట్టే పత్రాలు మాయం చేయడమే కాకుండా అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాహుల్ తెలిపారు. ఎన్డీయే రాఫెల్ డీల్ అనీల్ అంబానీ కోసమేనని అన్నారు.
Also Read: ముషార్రఫ్ సంచలన నిజాలు : జైషే,ISIలు కలిసి భారత్ లో ఉగ్రదాడులు చేశాయి