ఎక్సైజ్ సుంకం.. 15 నెలల్లో తొమ్మిది సార్లు పెంపు
కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని 15 నెలల్లో తొమ్మిది సార్లు పెంచింది. ఈ 15 నెలల వ్యవధిలో లీటరు పెట్రోల్‌పై రూ. 11.77, లీటరు డీజిల్‌పై రూ. 13.47 ఎక్సైజ్ సుంకం పెరిగింది.

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని 15 నెలల్లో తొమ్మిది సార్లు పెంచింది. ఈ 15 నెలల వ్యవధిలో లీటరు పెట్రోల్‌పై రూ. 11.77, లీటరు డీజిల్‌పై రూ. 13.47 ఎక్సైజ్ సుంకం పెరిగింది.
కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని 15 నెలల్లో తొమ్మిది సార్లు పెంచింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడంతో నవంబర్ 2014, జనవరి 2016 మధ్య బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తొమ్మిదిసార్లు పెంచింది. ఈ 15 నెలల వ్యవధిలో లీటరు పెట్రోల్‌పై రూ. 11.77, లీటరు డీజిల్‌పై రూ. 13.47 ఎక్సైజ్ సుంకం పెరిగింది. దీంతో 2016-17లో ప్రభుత్వ ఖజానాకు రూ. 2 లక్షల 42 వేల కోట్ల ఆదాయం సమకూరింది. మరోవైపు, పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని పెంచడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
సుంకం పెంపు పేరుతో కేంద్ర ప్రభుత్వం సామాన్యులను లూటీ చేస్తుందని ఆరోపించింది. లీటర్ పెట్రోల్‌పై స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీని రూ.2 నుంచి రూ.8కి, డీజిల్‌పై రూ.4కు పెంచారు. అలాగే పెట్రోల్, డీజిల్‌పై రోడ్డు సెస్సును లీటరుకు రూ.1 పెంచారు. దీంతో ఈ సెస్సు రూ.10కి చేరింది. తాజా పెంపుతో లీటర్ పెట్రోల్‌పై మొత్తం ఎక్సైజ్ సుంకం రూ.22.98కు, డీజిల్‌పై రూ.18.83కు పెరిగింది.