Mamata Banerjee : హిందీలో మమత ట్వీట్..మండిపడుతున్న అభిమానులు
వెస్ట్ బంగాల్లో భవానీపుర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం మమతా బెనర్జీ ఇవాళ హిందీ దివస్ సందర్భంగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు
Mamata Banerjee వెస్ట్ బంగాల్లో భవానీపుర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం మమతా బెనర్జీ ఇవాళ హిందీ దివస్ సందర్భంగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంగళవారం మమతా బెనర్జీ హిందీలో చేసిన ట్వీట్లో…భారతీయులు మరియు భాష సుసంపన్నం కోసం కృషి చేస్తున్న వారికి శుభాకాంక్షలు అంటూ తాను పోటీ చేయబోతున్న భవానీపూర్లోని ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు మమతా.
అయితే ఈ హిందీ ట్వీట్ చూసి మమత అభిమానులే తీవ్రంగా మండిపడుతున్నారు. హిందీ పట్ల మమత చూపిస్తున్న ఉత్సాహం బాధాకరం..హిందీ కోసం ఇంతలా పరితపిస్తున్నారు..భవానీపూర్‌లో ఓట్ల కోసమే ఈ ప్రయత్నమైతే…మీకు 2019లో వచ్చిన ఫలితమే రిపీటవుతుంది అని, ఓ తృణమూల్ అభిమాని ట్వీట్ చేయడం గమనార్హం.
మమతా ఉప ఎన్నికలో పోటీ చేయబోయే భవానీపూర్‌లో గుజరాతీ, మార్వాడీ, పంజాబీ మాట్లాడే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇది గమనించే బీజేపీ మార్వాడీ అయిన ప్రియాంకా తిబ్రేవాల్‌ను బరిలోకి దింపింది. ఈ నేపథ్యంలో మమత చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బయటవాళ్లు కామెంట్‌తో బీజేపీ నాయకత్వంపై దాడి చేసిన మమత ఇప్పుడు అదే బయటివాళ్లను ఆకర్షించడానికి ఇలా హిందీలో ట్వీట్ చేయడమేంటన్న విమర్శలు వస్తున్నాయి. కాగా, భవానీపుర్ ఉప ఎన్నికకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 3న ఫలితం వెలువడనుంది.
మరోవైపు, భవానీపుర్ ఉప ఎన్నికకు సీఎం మమతా బెనర్జీ సమర్పించిన నామినేషన్‌ను తిరస్కరించాలని బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ రిటర్నింగ్ అధికారికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. మమత సమర్పించిన అఫిడవిట్లో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల గురించి చేప్పలేదని ప్రియాంక టిబ్రేవాల్ ఆరోపించారు. ఈ కేసులకు సంబంధించి మీడియా నివేదికలను కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం క్రిమినల్ కేసుల వివరాలు చెప్పాలని, అలా చేయనందున మమత నామినేషన్ చెల్లుబాటు కాదని వివరించారు.
READ Bhawanipur : మమత బెనర్జీకి సొంత ఇల్లు, వాహనం లేదట..!
READ Mamata Banerjee : భవానీపుర్ అసెంబ్లీ స్థానానికి మమత నామినేషన్