ఎగ్జిట్ పోల్స్.. ఝార్ఖండ్‌లో గెలుపు ఎవరిదంటే..
ఝార్ఖండ్ లో 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. రెండు విడతల్లో పోలింగ్ జరిగింది.

Jharkhand Exit Polls 2024 (Photo Credit : Google)
Maharashtra Exit Polls 2024 : ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం.. ఝార్ఖండ్ లో సంచలనం నమోదు కానుందని అని తేలింది. మెజార్టీ సర్వే సంస్థలు ఎన్డీయే కూటమి గెలుపు ఖాయం అంటున్నాయి. ఇంతకీ ఏ సంస్థ అంచనా ఏ విధంగా ఉందో అనే వివరాలు చూద్దాం…
టైమ్స్ నౌ-జేవీసీ..
జేఎంఎం ప్లస్-30-40
ఎన్డీయే – 40-44
ఇతరులు – 01
సీఎన్ఎన్ న్యూస్ 18..
జేఎంఎం ప్లస్ – 30
ఎన్డీయే – 47
ఇతరులు – 04
మ్యాట్రిజ్..
జేఎంఎం ప్లస్ – 25-30
ఎన్డీయే – 42-47
ఇతరులు – 1-4
పీపుల్స్ పల్స్..
జేఎంఎం ప్లస్ – 24-37
ఎన్డీయే – 44-53
ఇతరులు – 06-10
చాణక్య..
జేఎంఎం ప్లస్ – 35-38
ఎన్డీయే – 45-50
ఇతరులు – 3-5
యాక్సిస్ మై ఇండియా..
జేఎంఎం ప్లస్ – 53
ఎన్డీయే – 25
ఇతరులు – 03
ఐ-పీపీఆర్..
జేఎంఎం ప్లస్ – 26
ఎన్డీయే – 48
ఇతరులు – 06
81 అసెంబ్లీ స్థానాలున్న ఝార్ఖండ్ లో బీజేపీ కూటమి మ్యాజిక్ ఫిగర్ 41ని దాటేస్తుందని మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేశాయి. మ్యాట్రిజ్, పీపుల్స్ పల్స్, టైమ్స్ నౌ బీజేపీ కూటమి అధికారం చేపడుతుందని అంచనా వేశాయి. యాక్సిస్ మై ఇండియా ఒక్కటే బీజేపీ 25 సీట్లకు పరిమితం అవుతుందని, ఇండియా కూటమి 53 సీట్లతో అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది.
మహారాష్ట్ర, ఝార్ఖండ్ లో పోలింగ్ ముగిసింది. మహారాష్ట్రలో సాయంత్రం 5 గంటల వరకు 58.22 శాతం పోలింగ్ నమోదైంది. ఝార్ఖండ్ లో సాయంత్రం 5 గంటల వరకు 67.59 శాతం పోలింగ్ నమోదైంది. ముంబై, పుణె సహా పలు పట్టణాల్లో అత్యల్పంగా పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించారు. ఝార్ఖండ్ లో 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. ఈ నెల 23న ఫలితాలు రానున్నాయి.
Also Read : ఎగ్జిట్ పోల్స్.. మహారాష్ట్రలో అధికారం వారిదే?