ఎగ్జిట్ పోల్స్.. మహారాష్ట్రలో అధికారం వారిదే?
మహారాష్ట్రలో సాయంత్రం 5 గంటల వరకు 58.22 శాతం పోలింగ్ నమోదైంది.

Maharashtra Exit Polls 2024 (Photo Credit : Google)
Maharashtra Exit Polls 2024 : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం.. మహారాష్ట్రలో బీజేపీ కూటమిదే అధికారం అని తేలింది. మెజార్టీ సర్వే సంస్థలు ఎన్డీయే కూటమి గెలుపు ఖాయం అంటున్నాయి. ఎన్డీయే కూటమి భారీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. ఇంతకీ ఏ సంస్థ అంచనా ఏ విధంగా ఉందో అనే వివరాలు చూద్దాం…
పీ మార్క్ సంస్థ..
ఎన్డీయే-137-157
ఇండియా-126-146
ఇతరులు-2-8
Matrize సంస్థ..
ఎన్డీయే-150-170
ఇండియా-110-130
ఇతరులు-8-10
పీపుల్స్ పల్స్..
ఎన్డీయే-175-195
ఇండియా-85-112
కేకే సర్వేస్..
ఎన్డీయే-225
ఇండియా-56
ఇతరులు-7
చాణక్య స్ట్రాటజీస్..
ఎన్డీయే-152-160
ఇండియా-130-138
ఇతరులు-6-8
పోల్ డైరీ..
ఎన్డీయే-122-186
ఇండియా-69-121
సీఎన్ఎన్ న్యూస్..
ఎన్డీయే-154
ఇండియా-128
ఇతరులు-06
మహారాష్ట్రలో మహాయుతి కూటమి మళ్లీ అధికారంలోకి రావొచ్చని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. బీజేపీ, శివసేన, ఎన్సీపీ నేతృత్వంలోని కూటమికి.. 175 నుంచి 195 సీట్ల వస్తాయంది. బీజేపీకి 113, శివసేనకు 52, ఎన్సీపీకి 17 సీట్లు సొంతంగా వస్తాయంది. కాంగ్రెస్, ఎన్సీపీ, ఎస్పీ, యుబీటీ నాయకత్వంలోని ఎంవీఏకు 85 నుంచి 112 సీట్లు మాత్రమే వస్తాయంది. కాంగ్రెస్ కు 35, శరద్ పవార్ పార్టీకి 35, ఉద్ధవ్ సేనకు 27 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
మహారాష్ట్ర, ఝార్ఖండ్ లో పోలింగ్ ముగిసింది. మహారాష్ట్రలో సాయంత్రం 5 గంటల వరకు 58.22 శాతం పోలింగ్ నమోదైంది. ఝార్ఖండ్ లో సాయంత్రం 5 గంటల వరకు 67.59 శాతం పోలింగ్ నమోదైంది. ముంబై, పుణె సహా పలు పట్టణాల్లో అత్యల్పంగా పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించారు. ఝార్ఖండ్ లో 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. ఈ నెల 23న ఫలితాలు రానున్నాయి.
Also Read : మహారాష్ట్రలో ఓటర్ల మనసు గెలిచేది ఎవరు? అధికారంలో నిలిచేది ఎవరు?