#TwinTowers: ట్విన్ టవర్స్ కూల్చివేతకు వాడిని పేలుడు పదార్థాలు 3 అగ్ని/4 పృథ్వి/12 బ్రహ్మోస్ క్షిపణులతో సమానం
కుతుబ్ మినార్ కంటే ఎత్తైన ఈ ట్విన్ టవర్ కూల్చివేత దేశ చరిత్రలో నిలిచిపోనుంది. దేశంలో ఇప్పటి వరకు కూల్చిన అతిపెద్ద భవనంగా ఇది రికార్డుకు ఎక్కింది. కిలోమీటరు దూరంలో ఉండి బటన్ నొక్కగానే.. తొమ్మిదంటే తొమ్మిదే సెకన్లలో భవనం శిథిలాల్లో కలిసిపోయింది. కాగా, ఈ ట్విన్ టవర్స్ కూల్చివేతకు ఉపయోగించిన పేలుడు పదార్థాలు మూడు అగ్ని-5 మిసైల్స్ లేదంటే 4 పృథ్వి మిసైల్స్ లేదంటే 12 బ్రహ్మోస్ మిసైల్స్‌తో సమానమని అంటున్నారు.

Explosives used in Noida Twin Towers demolition is equal to 3 Agni or 12 Brahmos or 4 Prithvi missiles
#TwinTowers: దాదాపు వెయ్యి కోట్ల ఖర్చుతో నిర్మించిన నోయిడాలోని ట్విన్ టవర్స్.. ఆదివారం మధ్యాహ్నం 2:45 నిమిషాలకు 9 సెకన్లలో నేలమట్టమయ్యాయి. మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రారంభమైన డిమోలిష్ ఆపరేషన్.. 30 నిమిషాల్లో పూర్తి చేసుకుంది. సెక్టార్ 93ఏలో ఉన్న ఈ ట్విన్ టవర్స్ కూల్చివేతకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను వినియోగించారు. రెండు భవనాల్లో మొత్తం 7,000 రంధ్రాలు, 20,000 సర్క్యూట్స్ ఏర్పాటు చేశారు. ప్రతి అంతస్తులో పేలుడు పదార్థాలను అమర్చి.. వాటర్ ఫాల్ టెక్నిక్ అనే పద్దతిలో భవనాలు నిలువుగా కింద పడేలాగా ప్లాన్ చేసి, పని పూర్తి చేశారు.
కుతుబ్ మినార్ కంటే ఎత్తైన ఈ ట్విన్ టవర్ కూల్చివేత దేశ చరిత్రలో నిలిచిపోనుంది. దేశంలో ఇప్పటి వరకు కూల్చిన అతిపెద్ద భవనంగా ఇది రికార్డుకు ఎక్కింది. కిలోమీటరు దూరంలో ఉండి బటన్ నొక్కగానే.. తొమ్మిదంటే తొమ్మిదే సెకన్లలో భవనం శిథిలాల్లో కలిసిపోయింది. కాగా, ఈ ట్విన్ టవర్స్ కూల్చివేతకు ఉపయోగించిన పేలుడు పదార్థాలు మూడు అగ్ని-5 మిసైల్స్ లేదంటే 4 పృథ్వి మిసైల్స్ లేదంటే 12 బ్రహ్మోస్ మిసైల్స్‌తో సమానమని అంటున్నారు.
Noida Twin Towers Demolition : కూల్చివేత తర్వాత నోయిడా ట్విన్ టవర్స్ వద్ద దృశ్యాలు
అగ్ని-5
అగ్ని-5 క్షిపణిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ) తయారు చేసింది. దీని బరువు 50,000 కిలోలు. 1.75 మీటర్ల పొడవు ఉంటుంది. ఘన ఇంధనంతో నడిచే మూడు దశల రాకెట్ బూస్టర్ల పైన 1,500 కిలోల వార్‌హెడ్ అమర్చబడింది. సెకనుకు శబ్దం వేగం కంటే 24 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే అగ్ని-5 క్షిపణి.. గరిష్ట వేగం గంటకు 29,401 కిలోమీటర్లు. పిన్ పాయింట్ లక్ష్యాన్ని చేధించడం ఈ క్షిపణి ప్రత్యేకత. నావిగేషన్ సిస్టమ్ ద్వారా దీన్ని ఆపరేట్ చేస్తారు.
బ్రహ్మోస్
ఇక బ్రహ్మోస్ క్షిపణి 300 కిలోల వార్‌హెడ్ కలిగి ఉంటుంది. లెలిమెట్రీ, రాడాద్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టంల ద్వారా ఈ క్షిపణిని ఆపరేట్ చేస్తారు. ఇది శబ్దానికి వేగానికి మూడు రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది. రష్యాలోని ఎన్‌పీఓఎం, ఇండియాలోని డీఆర్డీఓ సంస్థలు ఉమ్మడిగా దీన్ని రూపొందించాయి. సముద్రం, భూమి లక్ష్యాలను చేధించే విధంగా దీన్ని మరింత అప్‌గ్రేడ్ చేయాలని ఇరు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. బ్రహ్మోస్ శక్తివంతమైన క్షిపణి ఆయుధ వ్యవస్థ. ఇది ఇప్పటికే భారత మిలిటరీ చేతిలో ఉంది. జలాంతర్గాములు, నౌకలు, విమానాలు, ల్యాండ్ ప్లాట్‌ఫాం నుంచి ప్రయోగించవచ్చు.
పృథ్వీ
పృథ్వీ అనేది సమీకృత గైడెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద భారతదేశానికి చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసింది. ఇది ఒక వ్యూహాత్మక ఉపరితలం స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. ఉపరితలం నుంచి ప్రయోగించే ఈ క్షిపణిని ఉపరితలంలోని లక్ష్యాలను చేధించడానికి ఉపయోగిస్తారు. ఇది మన మిలిటరీ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్స్‌కు అప్పగించారు.
#TwinTowers: నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతలో 10 కీలక అంశాలు