Virat Kohli : మైదానంలో విరాట్ కోహ్లీ వద్దకు దూసుకొచ్చి కాళ్లు పట్టుకున్న అభిమాని.. వీడియో వైరల్

భారత్ జట్టు ఫీల్డింగ్ సమయంలో కోహ్లీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డులో ఉన్నాడు. అనుకోకుండా ఓ యువకుడు మైదానంలోని సెక్యూరిటీని దాటుకొని కోహ్లీ వద్దకు వేగంగా దూసుకొచ్చాడు.

Virat Kohli : మైదానంలో విరాట్ కోహ్లీ వద్దకు దూసుకొచ్చి కాళ్లు పట్టుకున్న అభిమాని.. వీడియో వైరల్

Virat Kohli

Virat Kohli Fan : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. పలు సందర్భాల్లో కోహ్లీ మైదానంలో ఉన్న సమయంలో అభిమానులు సెక్యూరిటీని దాటివచ్చి కౌలింగించుకోవటం చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే ఇండియా – అఫ్గాన్ రెండో టీ20 మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ టికెట్లు జనవరి 18 నుంచి విక్రయం.. ఆరోజు వారికి ఫ్రీ ఎంట్రీ

భారత్ జట్టు ఫీల్డింగ్ సమయంలో విరాట్ కోహ్లీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డులో ఉన్నాడు. అనుకోకుండా ఓ యువకుడు మైదానంలోని సెక్యూరిటీని దాటుకొని కోహ్లీ వద్దకు వేగంగా దూసుకొచ్చాడు. దీంతో కోహ్లీ అలర్ట్ అయ్యి అతన్ని వారించే ప్రయత్నం చేశాడు. కానీ, ఆ అభిమాని కోహ్లీ కాళ్లకు నమస్కార్ చేసి, కౌగిలించుకున్నాడు. కోహ్లీసైతం అభిమాని పట్ల అప్యాయతను చూపారు. ఈలోపు అక్కడికి వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది  యువకుడిని బలవంతంగా పక్కకు తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో కోహ్లీ భద్రతా సిబ్బందిని ఉద్దేశిస్తూ .. కఠినంగా వ్యవహరిచొద్దు అంటూ సూచించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : దంచికొట్టిన శివ‌మ్ దూబె, య‌శ‌స్వి జైస్వాల్‌.. రెండో టీ20 భార‌త్ విజ‌యం.. సిరీస్ కైవ‌సం

ఈ ఘటనపై సెక్యూరిటీ అధికారులు స్పందించారు. యువకుడిని విచారిస్తున్నట్లు చెప్పారు. విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో కోహ్లీ నుంచి యువడ్ని బలవతంగా విడతీసి తీసుకెళ్తున్న దృశ్యాలుగా కూడా ఉన్నాయి. సెక్యూరిటీ సిబ్బంది తీసుకెళ్తున్న సమయంలో ఆ యువకుడు సంతోషంగా కనిపించడం చూడొచ్చు.