Tomato Fields CC Cameras : టమాటా దొంగలకు భయపడి పొలంలో సీసీ కెమెరా అమర్చుకున్న రైతు
టమాట ధర పెరగడంతో దొంగలు వాటిపై దృష్టి పెట్టారు. టమాటా ట్రక్కుల డ్రైవర్లను బెదిరించి వాటిని దారి మళ్లించడం.. టమాటా తోటల్లో పంటను దోచుకోవడం చేస్తున్నారు. మహారాష్ట్రలో తన పొలంలో పంటను కాపాడుకోవడం కోసం రైతు సీసీ కెమెరా అమర్చుకున్నాడు.

Tomato Fields CC Cameras
Tomato Fields CC Cameras : టమాటా ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో చాలా చోట్ల టమాటా దొంగతనాలు పెరిగిపోయాయి. వీటి నుంచి కాపాడుకోవడం కోసం ఓ రైతు తన పొలంలో సీసీ కెమెరాలు అమర్చాడు.
Most Expensive Tomato : టమాటాలా మజాకా.. కిలో రూ.3 కోట్లు, బంగారం కంటే బాబులాంటి ధర!
టమాటా ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పట్లో వీటి ధర తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ధరలు పెరిగిన నేపథ్యంలో చాలాచోట్ల టమాటా దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగల బారి నుంచి టమాటా పంటను కాపాడుకోవడం కోసం ఓ రైతు ఏకంగా తన పొలంలో సీసీ కెమెరాలు అమర్చాడు. మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీనగర్‌లో ఓ రైతు ఈ తెలివైన పని చేశాడు. మహారాష్ట్రలో కిలో టమాటా ధర సుమారు రూ. 160 గా ఉంది.
Steakhouse Tomato : కేజీ కన్నా బరువున్న టమాటాని చూసారా? వీటిని ఎలా పెంచాలంటే..
టమాటా ధరల పెరిగిన తరువాత అనేక దొంగతనాల ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా కర్ణాటకలోని కోలార్ నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌కి వెళ్తున్న రూ.21 లక్షలు విలువ చేసే టమాటా పండ్ల ట్రక్కు కనిపించకుండా పోయిందని కర్నాటక పోలీసులు చెబుతున్నారు. జార్ఖాండ్‌లోని కూరగాయల మార్కెట్‌లోని దుకాణాల్లో 40 కిలోల టమాటాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఇక సామాన్యులు టమాటా కొనడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. వీటి ధర పెరుగుదల నుంచి కాస్త ఉపశమనం కలిగించాలని ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో రూ.120 కి తగ్గిన ధర మళ్లీ రూ.200 కి చేరింది. ఇప్పట్లో అయితే టమాటా ధరలు దిగొచ్చే పరిస్థితి కనిపించడం లేదు.