Farmer Protest : మరోసారి ఢిల్లీచలోకి సన్నద్ధమైన రైతులు.. శంభు సరిహద్దుల్లో భారీగా కేంద్ర బలగాలు

పంటలకు కనీస మద్దతు ధరపై చట్టంకోసం ఆందోళన చేస్తున్న రైతులు.. కేంద్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు.

Farmer Protest : మరోసారి ఢిల్లీచలోకి సన్నద్ధమైన రైతులు.. శంభు సరిహద్దుల్లో భారీగా కేంద్ర బలగాలు

Farmers Protest

Updated On : February 21, 2024 / 1:47 PM IST

Farmers Protest Updates : పంటలకు కనీస మద్దతు ధరపై చట్టంకోసం ఆందోళన చేస్తున్న రైతులు.. కేంద్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. బుధవారం ఉదయం 11గంటల వరకు ప్రభుత్వం స్పందించాలని, లేకపోతే ఢిల్లీ చలో కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీంతో ఉదయం 11గంటలకు శంభు సరిహద్దు నుంచి ట్రాక్టర్లు, ట్రక్కుల్లో రైతులు ఢిల్లీవైపు కదిలేందుకు సిద్ధమవుతున్నారు. తొమ్మిదిరోజులుగా పంజాబ్ – హర్యానా సరిహద్దుల్లో రైతులు ఉన్నారు. రైతులు కేంద్రానికి డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో శంభు సరిహద్దుల్లో భారీగా కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. దీంతో రైతు సంఘం నాయుడు సర్వన్ సింగ్ పంధేర్ మాట్లాడుతూ.. కేంద్రం రైతులను అణచివేయొద్దు. ప్రధానమంత్రి ముందుకొచ్చి ఎంఎస్పీకి చట్టం ప్రకటిస్తే మా నిరసన విరమిస్తామని చెప్పారు. ఇలాంటి ప్రభుత్వాన్ని దేశం క్షమించదు. హర్యానా గ్రామాల్లో పారామిలటరీ బలగాలు మోహరించాయి. మేం ఏం నేరంచేశాం? మిమ్మల్ని మేం ప్రధానమంత్రిని చేశాం. కేంద్ర బలగాలు మమ్మల్ని ఈ విధంగా అణిచివేస్తాయని మేము ఎప్పుడూ అనుకోలేదు. దయచేసి రాజ్యాంగాన్ని రక్షించండి.. శాంతియుతంగా ఢిల్లీ వైపు వెళ్లనివ్వండి, ఇది మా హక్కు అంటూ సర్వన్ సింగ్ పంధేర్ అన్నారు.

Also Read : Farmers Protest Updates: కేంద్ర మంత్రులతో చర్చలు విఫలం.. 2500 ట్రాక్టర్లతో ఢిల్లీకి రైతులు.. సరిహద్దుల్లో హైఅలర్ట్

మరోవైపు రైతు డిమాండ్లపై రైతుల నాయకులతో చర్చలకు సిద్ధమని కేంద్రం చెబుతుంది. ఎంఎస్పీపై ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించడం పై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా
స్పందించారు. ప్రభుత్వం వైపు నుంచి చర్చ జరపడానికి ప్రయత్నించాం. అనేక ప్రతిపాదనలు చర్చించాం. కానీ రైతులు సంతృప్తి చెందలేదు. కేంద్రం రైతులకు మంచి చేయాలనుకుంటుంది. రైతులు తమ అభిప్రాయాలు ఇవ్వవచ్చు. మేము ఎల్లప్పుడూ అభిప్రాయాలను స్వాగతిస్తాం. అయితే, ఆ అభిప్రాయం ఎలా ఫలవంతం కావడానికి చర్చలు మాత్రమే మార్గం. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం ఖచ్చితంగా వస్తుందని అర్జున్ ముండా అన్నారు.

భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి గుర్దీప్ సింగ్ చాహల్ మాట్లాడుతూ.. రైతులు తమ ట్రాక్టర్లు, ట్రాలీలతో ముందుకు సాగుతారు. శంభు, ఖౌనారీ సరిహద్దు పాయింట్ల వద్ద రైతుల రద్దీ పెరిగిందని అన్నారు. బుధవారం శంభు సరిహద్దులో జరిగే నిరసనకు పంధేర్, బికెయు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లెవాల్ నాయకత్వం వహిస్తారని చాహల్ చెప్పారు.

Also Read : Farmers Protest: ఢిల్లీలో రైతుల ఆందోళన.. ఏం జరుగుతుందో తెలుసా? ఎటుచూసినా వారే..