కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ట్రాన్స్‌పోర్ట్ అలోవెన్స్ రాదట

Transport Allowance: ఆర్థిక శాఖ ప్రభుత్వ ఉద్యోగులకు లాక్‌డౌన్ సమయంలో ట్రావెలింగ్ అలోవెన్స్ అమౌంట్‌ను ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసింది. ‘ఒక క్యాలెండర్ నెలలో ఆఫీసుకు అటెండ్ అవని వారికి ట్రాన్స్‌పోర్ట్ అలోవెన్స్ ఇచ్చేది లేదని.. ఉద్యోగులకు డ్రా చేయడం కుదరని పని అని చెప్పేసింది. డిసెంబర్ 1న విడుదల చేసిన సర్క్యూలర్ లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్‌లో పేర్కొంది.
సూచించిన కాంపన్సేటివ్ అమౌంట్ ప్రకారమే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ట్రాన్స్‌పోర్ట్ అలోవెన్స్ కు అనుమతి వచ్చింది. ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లేందుకు ప్రయాణ ఛార్జీలను కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం.
మార్చి 23నుంచి మే 20 వరకూ ఉన్న లాక్‌డౌన్ పీరియడ్ లో ట్రాన్స్‌పోర్ట్ అలోవెన్స్ ఇచ్చేందుకు ఫైనాన్స్ మినిస్ట్రీ పలు రిఫరెన్స్ లు తీసుకుంది. ఈ కాలంలో వ్యక్తిగత టూర్లకు తిరిగిన అలోవెన్స్ ను ఇవ్వడాన్ని ప్రభుత్వం నిషేదించింది. చాలా గవర్నమెంట్ ఆఫీసులు స్టాఫ్ సామర్థ్యాన్ని తగ్గించి.. కుదిరినంత వరకూ ఉన్న ఉద్యోగులతోనే, లేదంటే వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చి ఆన్ లైన్ లోనే పనులు పూర్తి చేసింది.
దివ్యాంగులు, గర్భిణీ స్త్రీలు ఆఫీసులకు హాజరవడాన్ని మినహాయించింది. ఈ కాలంలో ఇంటినుంచే పనులు చేసుకోవచ్చని చెప్పింది. వారంతా లాక్ డౌన్ కాలంలో ఎటువంటి ట్రావెలింగ్ అలోవెన్స్ పొందలేరని స్పష్టం చేసింది. దీంతో పాటు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లేని సమయంలో సంస్థకు సంబంధించిన కార్, వాన్ లాంటి ఫీచర్ వాడుకున్న ఉద్యోగులు కూడా ట్రావెలింగ్ అలోవెన్స్ పొందడానికి అర్హులు కారు. వారికి సాధ్యం కాదు.