wolf : హమ్మయ్య.. బహ్రైచ్‌లో ఐదో తోడేలును బంధించిన అటవీ అధికారులు.. వీడియో వైరల్

డివిజనల్ పారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్ఓ) అజిత్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఐదు తోడేళ్లు పట్టుకున్నాం. మరో తోడేలును బంధించాల్సి ఉంది. త్వరలో దాన్నికూడా బంధిస్తామని తెలిపారు.

wolf : హమ్మయ్య.. బహ్రైచ్‌లో ఐదో తోడేలును బంధించిన అటవీ అధికారులు.. వీడియో వైరల్

wolf

Wolves attack in Bahraich District : యూపీలోని బహ్రైచ్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తోడేళ్ల దాడులు రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. దాదాపు ముప్పైకిపైగా గ్రామాలపై తోడేళ్ల గుంపు దాడులకు పాల్పడుతుంది. రాత్రివేళల్లో ఇంటి బయట పడుకున్న వారిపై తోడేళ్లు దాడిచేసి హతమారుస్తున్నాయి. ఇప్పటికే అటవీశాఖ అధికారులు తోడేళ్ల దాడులను అరికట్టేందుకు అన్నిప్రయత్నాలు చేస్తున్నారు. ‘ఆపరేషన్ బేడియా’నుసైతం ప్రారంభించారు. ఈ క్రమంలో నాలుగు తోడేళ్లను బంధించారు. మొత్తం ఆరు తోడేళ్లు ఉన్నట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు. తాజాగా మంగళవారం తెల్లవారుజామున మరో తోడేలును పట్టుకొని రెస్క్యూ షెల్టర్ కు తరలించారు. దీంతో ఇప్పటి వరకు ఐదు తోడేళ్లను పట్టుకోగా.. మరో తోడేలు కోసం వేట కొనసాగిస్తున్నారు.

Also Read : యూపీ ప్రజలపై పగబట్టిన తోడేళ్లు, నక్కలు.. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు.. షార్ప్ షూటర్ల వేట!

డివిజనల్ పారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్ఓ) అజిత్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఐదు తోడేళ్లు పట్టుకున్నాం. మరో తోడేలును బంధించాల్సి ఉంది. త్వరలో దాన్నికూడా బంధిస్తామని తెలిపారు. ప్రజలపై దాడులు చేస్తున్న తోడేళ్లను పట్టుకోవటానికి ప్రతీరోజూ శ్రమిస్తున్నాం. పది నుంచి 15 వేరువేరు ప్రాంతాల్లో తోడేళ్లు కనిపించాయని మాకు నెల రోజుల్లో ఫిర్యాదులొచ్చాయి. కానీ, మేము ఆరు తోడేళ్లు స్థానిక ప్రజలపై దాడులకు పాల్పడుతున్నట్లు గుర్తించాం. వాటిలో ఐదు తోడేళ్లను బంధించాం. ప్రజల నుంచి వచ్చిన సమాచారం మేరకు నిఘా పెట్టాం. తోడేళ్లు ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిన సమయంలో స్థానిక ప్రజలకు కనిపించి ఉండొచ్చు. అయితే, ఆరు తోడేళ్లే ఉన్నాయా.. అంతకన్నా ఎక్కువ తోడేళ్లు స్థానికంగా సంచరిస్తున్నాయా అనే విషయంపైనా ఆరా తీస్తున్నామని అజిత్ ప్రతాప్ సింగ్ తెలిపారు.ఇదిలాఉంటే.. బహ్రైచ్ జిల్లాలోనే గడిచిన మూడు నెలల్లో తోడేళ్ల దాడిలో ఎనిమిది మంది పిల్లలు, ఒక మహిళసహా తొమ్మిది మంది మరణించారు. పలువురు గాయపడ్డారు.