NCSCM : ఎన్సీఎస్సిఎమ్ లో ఖాళీల భర్తీ
పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదోతరగతి, గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ , బీఈ, బీటెక్ ఉత్తీర్ణత తోపాటు సంబంధిత పనిలో అనుభం కలిగి ఉండాలి.

Ncscm (1)
NCSCM : భారత ప్రభుత్వ పర్యావరణం, అటవీ,వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు సంబంధించి చెన్నైలోని నేషనల్ సెంటర్ ఫర్ సస్టయినబుల్ కోస్టల్ మేనేజ్ మెంట్ లో తాత్కాలిక ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
భర్తీ చేయనున్న ఖాళీలకు సంబంధించి ప్రాజెక్ట్ అసోసియేట్ 3 ఖాళీలు, ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1, ప్రాజెక్ట్ అసోసియేట్ 2, రీసెర్చ్ అసిస్టెంట్,టెక్నికల్ ఇంజనీర్ 4, టెక్నికల్ అసిస్టెంట్ 1, అడ్మినిస్ట్రేటివ్ అసోసియేట్ 3, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 2, మల్టీటాస్కింగ్ స్టాఫ్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదోతరగతి, గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ , బీఈ, బీటెక్ ఉత్తీర్ణత తోపాటు సంబంధిత పనిలో అనుభం కలిగి ఉండాలి. జీతభత్యాలకు గాను నెలకు 15వేల రూపాయల నుండి 67 వేల రూపాయలు మరియు హెచ్ ఆర్ ఏ చెల్లిస్తారు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దరఖాస్తులను ఆన్ లైన్ లో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది ఫిబ్రవరి 23గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://www.ncscm.res.in