Budget 2020 Bahi khata : పసుపు రంగు చీర..ఎర్రటి సంచితో సీతమ్మ

  • Published By: madhu ,Published On : February 1, 2020 / 05:02 AM IST
Budget 2020 Bahi khata : పసుపు రంగు చీర..ఎర్రటి సంచితో సీతమ్మ

Updated On : February 1, 2020 / 5:02 AM IST

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ ప్రాంగణానికి చేరుకున్నారు. పసుపు రంగు చీర ధరించిన నిర్మలా..ఎర్రటి వస్త్రంలో చుట్టి..రాజముద్ర ఉన్న ఉన్న సంచిలో బడ్జెట్ ప్రతులు తీసుకొచ్చారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రులు బ్రీఫ్ కేసుతో మీడియా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంప్రదాయానికి నిర్మలా తెరిదించారు. గతంలో కూడా ఇలాగే..వచ్చారు.

బ్రిటీష్ సంప్రదాయ బ్రీఫ్ కేసుకు బదులు భారత సంప్రదాయ పద్థతిలో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్ ధైర్యాన్ని చాలా మంది ప్రశంసించారు. ఆంగ్లేయుల పాలన కాలం నుంచి బడ్జెట్ పత్రాలను లెదర్ బ్రీఫ్ కేసులో తీసుకరావడం జరిగింది. ఈ సంప్రదాయాన్ని నిర్మలా పక్కనపెట్టారు. 

దీనిపై గతంలోనే ఆమె క్లారిటీ ఇచ్చారు. బ్రిటీష్ హ్యాంగోవర్ నుంచి బయటకు రావడానికి ఇదే సరైన సమయమని, మోసుకరావడానికి చాలా సులభంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. బడ్జెట్ పత్రాలను తీసుకరావడానికి లెదర్ సూట్ కేసునే ఎందుకు వాడాలని, సంప్రదాయాల వైపు వెళుదామన్నారు. 

సాధారణంగా బడ్జెట్‌కు లెదర్ బ్యాగుతో సంబంధం ఉందని చెప్పాలి. బడ్జెట్ అనే పదం బగట్టే అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చిందనే విషయం తెలిసిందే. ఆర్థిక మంత్రులు ఎరుపు, గోధుమ, నలుపు వంటి రంగుల్లో ఉన్న బ్రీఫ్ కేసులను తీసుకొస్తుంటారు. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్..నలుగు రంగు బ్రీఫ్ కేసుతో మీడియా ముందుకు వచ్చారు. 

Read More :  కేంద్ర బడ్జెట్ అంచనాలు : వ్యక్తిగత ఆదాయ పన్ను తగ్గింపు
రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం 2020 – 21 సంవత్సరానికి మంత్రి నిర్మాలా సీతారామన్ బడ్జెట్ పార్లమెంట్‌లో 2020, ఫిబ్రవరి 01వ తేదీ శనివారం ప్రవేశ పెట్టనున్నారు.