Adi Shankaracharya Statue : శివరాజ్ చౌహాన్ ఆవిష్కరించిన 108 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహం..దీని విశిష్టత ఏంటో తెలుసా?
ఓంకారేశ్వర్‌లో ఆదిశంకరాచార్య 108 అడుగుల విగ్రహాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవిష్కరించారు. రూ.2,141.85 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ విగ్రహ విశిష్టత ఏంటో తెలుసా?

Adi Shankaracharya Statue
Adi Shankaracharya Statue : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఓంకారేశ్వర్‌లో 108 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీనికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఓంకారేశ్వర్‌లో 8 వ శతాబ్దానికి చెందిన వేద పండితులు, గురువు ఆదిశంకరాచార్య 108 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని నర్మదా నది ఒడ్డున ఉన్న ఓంకారేశ్వర్‌లోని మాంధాత పర్వతంపై నిర్మించారు. అనేక లోహాల సమ్మేళనంతో ఈ విగ్రహాన్ని తయారు చేసారు. విగ్రహం 54 అడుగల ఎత్తైన పీఠంపై ఉంది. దీనికి ‘ఏకత్మాతా కి ప్రతిమా’ (ఏకత్వం యొక్క విగ్రహం) అని పేరు పెట్టారు.
Police Dragged Woman : మధ్యప్రదేశ్ లో అమానవీయ ఘటన.. మహిళ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన పోలీసులు
ఓంకారేశ్వర్ 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పేరు పొందింది. శివుడిని ఆరాధించే పవిత్ర క్షేత్రం. మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం ఓంకారేశ్వర్‌లోని మ్యూజియంతో పాటు ఆదిశంకరాచార్య విగ్రహం కోసం రూ.2,141.85 కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. కేరళలో జన్మించిన ఆదిశంకరాచార్యులు చాలా చిన్నవయసులో సన్యాసిగా మారి ఓంకారేశ్వర్‌కి వచ్చారని చెబుతారు. అక్కడ ఆయన తన గురువు గోవింగ్ భగవద్‌పాద్‌ను కలుసుకున్నారట. ఇక్కడే నాలుగు సంవత్సరాలు ఉండి విద్యను అభ్యసించారట.