The Oberoi Amarvilas : వరల్డ్ టాప్ 50 రెస్టారెంట్లలో ఇండియన్ రెస్టారెంట్.. ఎక్కడుందో తెలుసా?
వరల్డ్ బెస్ట్ 50 రెస్టారెంట్ల జాబితాలో భారతదేశం చోటు దక్కించుకుంది. ఇటలీలోని పాసలాక్వా అత్యుత్తమ హోటల్‌గా నంబర్ వన్ ప్లేస్ దక్కించుకోగా భారత్ ఎన్నో స్ధానంలో ఉందా తెలుసా?

The Oberoi Amarvilas
The Oberoi Amarvilas : ప్రపంచంలోని బెస్ట్ రెస్టారెంట్ల జాబితా బయటకు వచ్చింది. అందులో భారత్ ర్యాంక్ ఎంతో తెలుసుకోవాలని ఉందా?
Singapore : కడుపునిండా పీతల కూర తిన్నారు..బిల్లు చూసి షాకయ్యారు.. రెస్టారెంట్ ఎంత బిల్లు వేసిందంటే?
ప్రపంచంలోనే 50 ఉత్తమ హోటళ్ల జాబితా ఆవిష్కరించారు. అందులో భారత్ కూడా చోటు దక్కించుకుంది. ఇటలీలోని లేక్ కోమోలో ఉన్న 18వ శతాబ్దపు విల్లా అయిన పాసలాక్వా అత్యుత్తమ హోటల్‌గా నంబర్ వన్ ప్లేస్ దక్కించుకుంది. ఏడు ఎకరాల విస్తీర్ణంలో టెర్రస్ తోటల మధ్య ఉన్న విల్లా హోటల్ అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. ‘ది వరల్డ్స్ 50 బెస్ట్ హోటల్స్’ కోసం ర్యాంకింగ్‌లు ఇవ్వడానికి 580 మంది సభ్యుల ప్యానెల్ సమర్పించిన నామినేషన్లను పరిగణనలోకి తీసుకున్నారట. ఈ ప్యానెల్‌లో ట్రావెల్ జర్నలిస్టులు, అనుభవజ్ఞులైన హోటళ్ల వ్యాపారులు ఉన్నారట.
ఇటలీలోని పాసలాక్వా హోటల్ టాప్‌లో నిలబడగా.. హాంగ్ కాంగ్‌లోని రోజ్ వుడ్ హాంగ్ కాంగ్, థాయ్ లాండ్‌లోని ఫోర్ సీజన్స్ బ్యాంకాక్, హాంకాంగ్‌లోని ది అప్పర్ హౌస్, జపాన్‌లోని అమన్ టోక్యో.. ఇలా వరుస స్ధానాల్లో నిలబడగా.. ఒబెరాయ్ అమరవిలాస్, ఆగ్రా (The Oberoi Amarvilas) టాప్ 45 లోచోటు దక్కించుకుంది . జాబితా మొత్తం పరిశీలిస్తే యూరప్, ఆసియాలోని హోటళ్లు టాప్ ప్లేస్‌లో ఉన్నట్లు వెల్లడవుతోంది.
The ultimate bucket list for unlocking luxury travel: https://t.co/NZqseaA7Z1 #Worlds50BestHotels #50BestHotels pic.twitter.com/Rp2Lm6mgiO
— 50 Best Hotels (@50Best_Hotels) September 20, 2023