KamDevBaba : ఈ కుండను దేనితో తయారు చేశారో…ఎన్నిసార్లు కొట్టినా పగల్లేదు

ఓ ప్రాంతంలో కుండను పగులగొట్టడానికి ఇధ్దరు యువకులు తెగ కష్టపడ్డారు. రాయితో కొట్టినా..ఆ కుండ పగులలేదు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

KamDevBaba : ఈ కుండను దేనితో తయారు చేశారో…ఎన్నిసార్లు కొట్టినా పగల్లేదు

Utti

Updated On : September 11, 2021 / 9:59 PM IST

Who Made This Matki : శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా..ఉట్లను కొడుతుంటారు పలు ప్రాంతాల్లో.  బాగా ఎత్తులో కుండను కడుతారు. దీనిని కొట్టడానికి యువకులు ఒకరిపై ఒకరు ఎక్కి..ఆ కుండను కొబ్బరి కాయ లేదా ఇతరత్రా వాటితో కొడుతూ సంబరాలు చేసుకుంటుంటారు. అయితే ఓ ప్రాంతంలో కుండను పగులగొట్టడానికి ఇధ్దరు యువకులు తెగ కష్టపడ్డారు. రాయితో కొట్టినా..ఆ కుండ పగులలేదు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ..ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

Read More : Rajasthan : పుట్టింటికి వెళ్తానన్న భార్య..ముక్కు కోసి పడేసిన భర్త

కృష్ణాష్టమి సందర్భంగా..ఓ ప్రాంతంలో ఓ చోట ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. యువకులు ఒకరిపై ఒకరు ఎక్కి.. కుండను పగులగొట్టే ప్రయత్నం చేశారు. అక్కడున్న వారిని వీరిని ప్రోత్సాహిస్తున్నారు. కానీ..ఓ యువకుడు కుండను పగులగొట్ట లేకపోయాడు. కుండను పగులగొట్టేందుకు మరో యువకుడు వచ్చాడు. నేను పగులగొడుతాననే బిల్డప్ లో వచ్చాడు. కుండను పట్టుకుని ఓ దెబ్బ వేశాడు. పగుల్లేదు. మరొక దెబ్బ వేశాడు.

Read More : McDonald India మెనూలో కొత్త ఐటమ్స్.. పసుపు పాలు, మసాలా కడక్‌ చాయ్!

అయినా అంతే..దీంతో అతనిలో కసి పెరిగిపోయింది. దబా..దబా అంటూ..దెబ్బలు వేశాడు. అయిన కొద్దిగా కూడా పగులు రాలేదు ఆ కుండకు. కామ్ దేవ్ బాబా అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా చేసిన ఈ వీడియో వైరల్ అయ్యింది. ఎవరు తయారు చేశారో ఏమో, ఫేవికాల్ పెట్టాడా ? అంటూ సరదా సరదా కామెంట్స్ చేస్తున్నారు. దేశంలో రోడ్లు, బ్రిడ్జిల కాంట్రాక్టులు ఇద్దాంటూ ఛలోక్తిగా కామ్ దేవ్ బాబా రాసుకొచ్చారు.