బస్సు దగ్ధం..ఆరుగురు మృతి, 17 మందికి గాయాలు

fire accident in rajasthan : రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జాలోర్ జిల్లాలోని బస్సు దగ్ధమైన ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పదిహేడు మంది తీవ్రంగా గాయపడ్డారు. మహేశ్‌పూర్‌లో విద్యుత్ తీగ బస్సుకు తగిలింది. దీంతో మంటలు వ్యాపించి క్షణాల్లోనే బస్సుకు అంటుకున్నాయి. దీంతో పెను ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, కండెక్టర్ సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరో నలుగురు ఆసుపత్రిలో మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.