Madhurai Train Fire Accident : మధురై రైలు బోగీల్లో ఘోర అగ్నిప్రమాదం, 9 మంది మృతి

మధురై నగరంలోని రైలు బోగీల్లో శనివారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మదురై రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఆగి ఉన్న ఆధ్యాత్మిక పర్యాటక రైలు బోగీల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 9 మంది మరణించారు. రైలు బోగీల్లో వంట చేస్తుండగా సిలిండర్ పేలినట్లు సమాచారం....

Madhurai Train Fire Accident : మధురై రైలు బోగీల్లో ఘోర అగ్నిప్రమాదం, 9 మంది మృతి

Madhurai Fire Accident in Train

Updated On : August 26, 2023 / 10:10 AM IST

Madhurai Train Fire Accident : మధురై నగరంలోని రైలు బోగీల్లో శనివారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మదురై రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఆగి ఉన్న ఆధ్యాత్మిక పర్యాటక రైలు బోగీల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో  9 మంది మరణించారు. రైలు బోగీల్లో వంట చేస్తుండగా సిలిండర్ పేలినట్లు సమాచారం. (Fire accident in train coaches in Madurai) గాలి వేగంతో రైలు కోచ్‌లలో మంటలు చెలరేగాయి. మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పారు.

US Navy Fighter Jet : కూలిన యూఎస్ నేవీ ఫైటర్ జెట్…పైలట్ దుర్మరణం

లక్నో నుంచి బయలుదేరిన టూరిస్ట్ రైలు కోచ్‌లో మంటలు చెలరేగడంతో ఆగిపోయింది. 15 రోజుల పర్యటన కోసం లక్నో నుంచి బయలుదేరిన రైలు మధురై రైల్వే స్టేషన్ సమీపంలో నిలిచిపోయింది. రైలులో మంటలు చెలరేగి కాలిపోవడంతో 20 మందికి పైగా కాలిన గాయాలైనట్లు రైల్వే అధికారులు చెప్పారు.

Prime Minister Narendra Modi : రెండు దేశాల పర్యటన ముగించుకొని బెంగళూరు చేరిన మోదీ… చంద్రయాన్-3 బృందంతో భేటీ

రైలు బోగీల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు పేర్కొన్నారు. తీవ్రమైన కాలిన గాయాలకు గురైన వారిలో అయిదుగురు మరణించి పోలీసులు చెప్పారు. ఈ అగ్నిప్రమాదంపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.