Fire breaks out : రెండు రైళ్లలో రాజుకున్న మంటలు..25 మందికి గాయాలు
దేశంలో ఒక రోజు వ్యవధిలోనే రెండు రైళ్లలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వేర్వేరుగా రెండు రైళ్లలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు....

Darbhanga Superfast Express
Fire breaks out : దేశంలో ఒక రోజు వ్యవధిలోనే రెండు రైళ్లలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వేర్వేరుగా రెండు రైళ్లలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వైశాలీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు స్లీపర్ కోచ్ లో గురువారం తెల్లవారుజామున మంటలు అంటుకున్నాయి. ఈ అగ్నిప్రమాదంలో 19 మంది గాయపడ్డారని రైల్వే పోలీసులు చెప్పారు. వైశాలీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఎస్ 6 బోగీలో మంటలు రాజుకున్నాయి. పాంట్రీకారు పక్కన ఉన్న బోగీలో మంటలు అంటుకున్నాయని రైల్వే పోలీసులు చెప్పారు. మొత్తం మీద రెండు రైళ్లలో జరిగిన అగ్నిప్రమాదాల్లో క్షతగాత్రుల సంఖ్య 25కు పెరిగింది.
ALSO READ : UP woman : అత్యాచారానికి యత్నించిన వ్యక్తిని మహిళ ఏం చేసిందంటే…షాకింగ్ ఘటన
దీంతో వెంటనే రైలును ఆపి సహాయ బృందం సంఘటన స్థలానికి వచ్చిందని ఈటావా రూరల్ ఎస్పీ సత్యపాల్ సింగ్ చెప్పారు. ఈ సంఘటనకు ముందు బుధవారం రాత్రి న్యూఢిల్లీ- దర్బంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు బోగీల్లో మంటలు అంటుకున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సరాయి భోపత్ రైల్వే స్టేషను సమీపంలో రైలు బోగీల్లో అగ్నిప్రమాదం జరిగింది. మూడు బోగీల్లో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు.
ALSO READ : IND vs NZ : వన్డే ప్రపంచకప్‌లో 50 వికెట్లతో తొలి భారత బౌలర్‌గా మహ్మద్ షమీ..
రైలు సరాయ్ భూపత్ స్టేషన్ గుండా వెళుతున్నప్పుడు, స్లీపర్ కోచ్‌లో పొగలు రావడాన్ని స్టేషన్ మాస్టర్ గమనించారు. దీంతో స్టేషన్ మాస్టర్ రైలు డ్రైవర్, గార్డులకు సమాచారం అందించి రైలును నిలిపివేశారు. అనంతరం స్లీపర్ కోచ్ నుంచి ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. మంటలు అంటుకున్న వెంటనే పలువురు ప్రయాణికులు రైలు నుంచి దూకేశారు. అగ్నిప్రమాదం జరిగినపుడు రైలులో సామర్థ్యం కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నారు.
ALSO READ : IND vs NZ : వన్డే ప్రపంచకప్‌లో 50 వికెట్లతో తొలి భారత బౌలర్‌గా మహ్మద్ షమీ..
గాయపడిన ఆరుగురు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించామని ఆర్‌పీఎఫ్ కంపెనీ కమాండర్ గజేంద్రపాల్ సింగ్ చెప్పారు. ఈ ప్రమాదం అనంతరం రైలు ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు పంపించామని రైల్వే అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో కాలిపోయిన మూడు కోచ్‌లను రైలు నుంచి వేరు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల రైలులో మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. ఇటీవల వరుస రైలు ప్రమాదాలతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.