సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు…బోబ్డే అధ్యక్షతన కమిటీ ఏర్పాటు

చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగొయ్ పై లైంగిక ఆరోపణలపై విచారణ సందర్భంగా మంగళవారం(ఏప్రిల్-23,2019) కీలక మలువు చోటుచేసుకుంది.జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే అధ్యక్షతన ‘‘అంతర్గత విచారణ’’కు సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయి ఆదేశించారు. సీజేఐ తరువాత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో జస్టిస్ ఎస్.ఎ.బోబ్డేయే అత్యంత సీనియర్. తన తరువాత సీనియర్ అయిన జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ ఇందిరా బెనర్జీలను కూడా ధర్మాసనంలోకి తీసుకుంటానని జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే తెలిపారు.
సీజేఐ తనను లైంగికంగా వేధించారని సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని ఒకరు ఇటీవల 22మంది జడ్జిలకు లిఖితపూర్వకంగా కంప్లెయింట్ చేసిన విషయం తెలిసిందే. చేశారు. దీనిపై సీజేఐ రంజన్‌గొగొయి అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమైన ప్రత్యేక ధర్మాసనం ఏప్రిల్-20,2019న విచారణ జరిపింది. సీజేఐపై వచ్చిన లైంగిక ఆరోపణలపై ఏం చేయాలనే విషయమై సోమవారం సాయంత్రం, మంగళవారం ఉదయం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తుల మధ్య చర్చోపచర్చలు జరిగాయి. తనపై వచ్చిన ఆరోపణలపై తన అధ్యక్షతన ఏర్పాటైన ధర్మాసనం విచారించడమేమిటని సీజేఐ విచారణ తీరును సుప్రీంకోర్టు న్యాయవాద సంఘాలు తప్పుబట్టడం చర్చనీయాంశమైంది.
ఈ సమయంలో ఈ కేసును జస్టిస్ అరుణ్‌మిశ్ర, జస్టిస్ రోహింగ్టన్ ఫాలి నారిమన్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం మంగళవారం సుమోటోగా విచారణకు స్వీకరించింది. అయితే మంగళవారం సాయంత్రానికి ఈ కేసును జస్టిస్ బోబ్డే అధ్యక్షతన అంతర్గత విచారణకు సీజేఐ ఆదేశించారు. సీజేఐను తప్పుడు కేసులో ఇరికించి రాజీనామా చేయించడానికి కుట్ర పన్నారని,సీజేఐకి వ్యతిరేకంగా ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఫ్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాలని,అందుకు గాను ఓ వ్యక్తి తనకు 1.5కోట్లు లంచం ఇవ్వజూపాడని వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు లాయర్ ఉత్సవ్ సింగ్కి బుధవారం విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.