Zeroda CEO Nithin Kamath : సోషల్ మీడియాకు ఎడిక్ట్ అయ్యారా? నితిన్ కామత్ సలహా చదవండి

సోషల్ మీడియా చాలామందికి వ్యసనంలా మారింది. దీని కారణంగా మానసిక వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ అడిక్షన్ నుంచి బయటపడటం ఎలాగో జిరోదా సీఈఓ నితిన్ కామత్ ట్విట్టర్‌లో చెబుతున్నారు.

Zeroda CEO Nithin Kamath : సోషల్ మీడియాకు ఎడిక్ట్ అయ్యారా? నితిన్ కామత్ సలహా చదవండి

zeroda ceo nithin kamath

Updated On : September 16, 2023 / 5:31 PM IST

zeroda ceo nithin kamath : తెల్లారి లేస్తే చేతిలో సెల్ ఫోన్ ఉండాలి. సోషల్ మీడియాలో ఏం జరుగుతోందో? చూడాలి. ఎన్ని పనులున్నా దీని తర్వాతే. అసలు సోషల్ మీడియా చూడకపోతే ఏదో మిస్ అయిపోతున్నామన్న ఫీలింగ్ చాలామందికి. నిజం చెప్పాలంటే సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయ్యేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇలా అడిక్ట్ అయ్యేవారిలో చాలామంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారట. ఈ వ్యసనం తగ్గించుకోవడం ఎలా?  జిరోదా సీఈఓ నితిన్ కామత్ సలహాలు ఇస్తున్నారు. ట్విట్టర్‌లో ఆయన పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.

Social Media : పదేళ్ల వయస్సులో తప్పిపోయిన బాలికను 20 ఏళ్ల తరువాత ఇంటికి చేర్చిన సోషల్ మీడియా

సోషల్ మీడియాతో పరిచయం లేనివారు లేరేమో. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాకు అతుక్కుపోతున్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా రకరకాల యాప్‌లతో గంటలు గంటలు కాలక్షేపం చేసేస్తున్నారు. తెలీకుండానే విలువైన సమయాన్ని దానికి వెచ్చిస్తూ సమయం వృధా చేసుకుంటున్నారు. అంతేకాదు అనేక మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియాకు అడిక్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలనే అంశంపై జెరోదా సీఈఓ నితిన్ కామత్ కొన్ని సూచనలు చేసారు.

కొంతమంది సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టగానే దానికి ఎన్ని కామెంట్లు, ఎన్ని లైక్స్ వచ్చాయని పదే పదే చెక్ చేస్తుంటారు. వాళ్లు అనుకున్న రీతిలో రెస్పాన్స్ రాకపోతే డీలా పడిపోతారు. అంతేకాదు ఇతరుల పోస్టులకు వచ్చే స్పందనని తమ పోస్టులకు వచ్చే స్పందనతో పోల్చుకుంటూ ఉంటారు. అలా చేయవద్దని నితిన్ కామత్ చెబుతున్నారు. కామెంట్లను చెక్ చేసుకోకుండా ఉండటం, ఆన్ లైన్ ఎక్కువసేపు ఉండకుండా ఉండటం, రోజులో కేవలం 30 నిముషాలు మాత్రమే సోషల్ మీడియాలో గడపడం చేస్తూ నెమ్మదిగా ఆ వ్యసనం నుంచి బయటపడవచ్చని నితిన్ సూచిస్తున్నారు.

Pak ISI agents : పాక్ ఐఎస్ఐ మహిళల నకిలీ సోషల్ మీడియా అకౌంట్లు…అలర్ట్ జారీ

సోషల్ మీడియా వ్యవసనం నుంచి బయటపడటం చాలా కష్టమని.. తాను కూడా ఈ వ్యవసనం నుంచి బయటపడినట్లు నితిన్ పోస్ట్‌లో వెల్లడించారు. నితిన్ పోస్టుపై డేజ్‌ఇన్ఫో ఫౌండర్ అమిత్ మిశ్రా స్పందించారు. విలువైన సూచనలు ఇచ్చారంటూ ప్రశంసించారు. నెటిజన్లు సైతం ఆయన సూచనలను అంగీకరిస్తున్నామంటూ కామెంట్లు పెట్టారు. ప్రస్తుతం నితిన్ కామత్ పోస్టు వైరల్ అవుతోంది.