Cancer Treatment: తల్లి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం కన్యత్వాన్ని పణంగా పెట్టిన బాలిక

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ మహిళ డబ్బు సంపాదించే క్రమంలో ఆ బాలిక ప్రాణాన్ని, మానాన్ని అమ్మకానికి పెట్టింది.

Cancer Treatment: తల్లి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం కన్యత్వాన్ని పణంగా పెట్టిన బాలిక

Minor Girl

Updated On : October 2, 2021 / 5:30 PM IST

Cancer Treatment: త్యాగం. బిడ్డల కోసం, వారి ఆకలి తీర్చడం కోసం తల్లి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. మరి ఆ తల్లే కష్టాల్లో ఉంటే.. కాపాడుకోవాలనే తపన ఉన్నా సంపాదించే శక్తి లేదు. ఏ నిర్ణయం తీసుకోవాలో స్పష్టత రాలేదు. తన తల్లిని బతికించుకోవాలని మాత్రమే తెలిసిన ఆ పసి మనసు డబ్బులిస్తారు కదా అని దారుణమైన త్యాగానికి సిద్ధమైంది.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ మహిళ డబ్బు సంపాదించే క్రమంలో ఆ బాలిక ప్రాణాన్ని, మానాన్ని అమ్మకానికి పెట్టింది. బాలిక తల్లి పరిచయస్థురాలైన మహిళ మీ అమ్మకు ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు తాను సమకూరుస్తానని చెప్పింది. తల్లి క్యాన్సర్ ట్రీట్మెంట్ కు డబ్బుల కోసం ఎదురుచూసిన ఆ చిన్నారికి ఆమె మాటలు ధైర్యాన్నిచ్చాయి. కాకపోతే నువ్వు ఒక పని చేయాలంటూ మెలిక పెట్టింది.

39ఏళ్ల అర్చన వైషపయాన్, 45 ఏళ్ల రంజమ మేష్రమ్, కవితా నిఖరే దీనికి సంబంధించి వ్యూహం పన్నారు. ఆ బాలికను ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకునేందుకు కుదిర్చారు. దానికి రూ.40వేలు ఇవ్వాలని బేరం మాట్లాడుకున్నారు. బాలిక తల్లితో వేరే ఇంట్లో పనిమనిషిగా చేసేందుకు మాట్లాడామని.. పంపించాలని చెప్పారు. బాలిక తమ్ముడైన రెండు సంవత్సరాల కొడుకు కోసం వెళ్లడానికి ఒప్పుకుంది తల్లి.

………………………………………….. : వివాహేతర సంబంధం.. ఆమె కోసం అన్నీ అమ్మేస్తున్న భర్త

కరోడిలోని అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి బేరం కుదుర్చుకున్న వ్యక్తి కోసం ఎదురుచూసింది. సీన్ కట్ చేస్తే.. రూ.40వేలు ఇస్తానని చెప్పింది పోలీస్ ఇన్ఫార్మర్. సీన్ లోకి పోలీసులు ఎంటరై మహిళల ముఠాను అరెస్టు చేశారు. బాలికను కాపాడి తల్లికి అప్పగించారు.