Illegal Affair Murder : వివాహేతర సంబంధం.. ఆమె కోసం అన్నీ అమ్మేస్తున్న భర్త

పెళ్లై భార్యా పిల్లలు ఉన్న వ్యక్తి పక్క ఊర్లోని మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె మోహంలో పడి కుటుంబ సభ్యులను పట్టించుకోవటం మానేశాడు.

Illegal Affair Murder : వివాహేతర సంబంధం.. ఆమె కోసం అన్నీ అమ్మేస్తున్న భర్త

Karnataka Man Murder

Illegal Affair Murder :  పెళ్లై భార్యా పిల్లలు ఉన్న వ్యక్తి పక్క ఊర్లోని మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె మోహంలో పడి కుటుంబ సభ్యులను పట్టించుకోవటం మానేశాడు. ఈక్రమంలో తన ఆస్తిని అమ్మి ప్రియురాలికి ఇవ్వటం భరించలేని కుటుంబ సభ్యులు భర్తను పాశవికంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా అచాపుర గ్రామానికి చెందిన వినోద్(45) భార్య బిను(42) కుమారులు వివేక్(21) విష్ణు(19)లతో నివసిస్తున్నాడు. వినోద్  పక్క గ్రామానికి చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం వినోద్ కుటుంబ సభ్యులకు తెలిసింది.

దీంతో వారి కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. ఇతర కుటుంబ సభ్యులు కూడా వినోద్ కు ఆ బంధాన్ని వదులుకోమని చెప్పారు. అయినా అతను వినలేదు. ఇటీవల వినోద్ తనకు చెందిన కొంత భూమిని అమ్మాడు. అందులో కొంత మొత్తాన్ని తన ప్రియురాలికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయమై ఇంట్లో వాళ్లు అభ్యంతరం చెప్పారు. దీంతో ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఇంకో ప్రోపర్టీ అమ్మి ఆమెకు ఇచ్చేందుకు వినోద్ ప్రయత్నించాడు.

ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలిసింది. ఎంత చెప్పినా వినోద్ వినక పోవటంతో విసుగు  చెందిన కుటుంబ సభ్యులు అతడ్ని అంత మొందించాలని ప్లాన్ వేశారు. సెప్టెంబర్ 26న వినోద్‌ను హత్య చేయటానికి పెట్రోల్ కొనుగోలు చేసారు. వినోద్ మెడకు ఇనుప తీగ బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. తలపై ఇనుప రాడ్ తో కొట్టి మరణించాడని ధృవీకరించుకున్నారు.

అనంతరం శవాన్ని కారులో తీసుకువెళ్ళి సమీపంలోని హునాసెకొప్ప అటవీ ప్రాంతానికి తరలించారు. అక్కడ వినోద్ ను కారు డ్రైవింగ్ సీటులో కూర్చోపెట్టి   పెట్రోల్ పోసి కారు తగలబెట్టారు.  ఇంటికి తిరిగి వచ్చి వినోద్ ఆత్మహత్య చేసుకున్నాడని  తీర్థహళ్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఆత్మహత్యగా  కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో వినోద్ కుటుంబ సభ్యులు పొంతనలేని సమాధానాలు  చెప్పటంతో  పోలీసులకు  అనుమానం వచ్చింది. అన్నికోణాల్లో పోలీసులు విచారణ  చేపట్టటంతో కుటుంబ సభ్యులే నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. ఈ కేసులో సంబంధం ఉన్న వినోద్ భార్య, ఇద్దరు కుమారులు, బిను సోదరి కొడుకు అశోక్ (23) వినోద్ సోదరుడు సంజయ్(36)లను  శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.