Delhi : క్యాబ్ డ్రైవర్ నిజాయితీని మెచ్చుకుంటున్న నెటిజన్లు.. ఇంతకీ అతను ఏం చేశాడు?

ఈరోజుల్లో సెల్ ఫోన్లు, వేలెట్‌లు పోగొట్టుకుంటే వాటిని మర్చిపోవడమే. మళ్లీ అవి మనకు తిరిగి దొరకడం అంటే లక్ అని చెప్పాలి. క్యాబ్‌లో సెల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తికి తిరిగి సెల్ ఫోన్ అందజేశాడు ఓ క్యాబ్ డ్రైవర్. అతని నిజాయితీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Delhi : క్యాబ్ డ్రైవర్ నిజాయితీని మెచ్చుకుంటున్న నెటిజన్లు.. ఇంతకీ అతను ఏం చేశాడు?

Delhi

Updated On : July 19, 2023 / 1:02 PM IST

Delhi : ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి ఆటోల్లో, క్యాబ్‌లలో వస్తువులు మర్చిపోతుంటాం. అలా ఓ కస్టమర్ తన మొబైల్ ఫోన్ క్యాబ్‌లో మర్చిపోయాడు. ఆ క్యాబ్ డ్రైవర్ ఆ వ్యక్తి ఉన్న హోటల్‌కి వెళ్లి అతని ఫోన్ అతనికి అందజేశాడు. అతని నిజాయితీ నచ్చిన ఆ వ్యక్తి ఆటోడ్రైవర్ మంచితనాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.

Delhi Metro : ఢిల్లీ మెట్రోలో యువతుల పోల్ డ్యాన్స్ .. DMRC ఎందుకు పట్టించుకోవట్లేదంటూ నెటిజన్లు ఫైర్

ఢిల్లీలోని ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లో ఫిట్‌నెస్ కోచ్ అయిన షాజన్ శామ్యూల్, సహోద్యోగి వివేక్ అర్ధరాత్రి క్యాబ్ బుక్ చేసుకున్నారు. అయితే ఆ క్యాబ్‌లో వివేక్ తన ఫోన్ పోగొట్టుకున్నాడు. ఇక వారు ప్రయాణం చేసిన  క్యాబ్ డ్రైవర్ హీరాలాల్ మోడల్ నంబర్ వారి వద్ద లేదు. ఫోన్ దొరకడం అయ్యే పని కాదని వారు డిసైడ్ అయ్యారు. కానీ ఆశ్చర్యం కలిగించేలా హీరాలాల్ మోండల్ ఫోన్ ఇవ్వడానికి తిరిగి హోటల్ కి వచ్చాడు. అతని నిజాయితీకి ఇద్దరు ఫిదా అయిపోయారు. అతనికి కృతజ్ఞతలు  చెప్పారు.

 

షాజన్ శామ్యూల్.. హీరాలాల్ మోండల్ నిజాయితీ గురించి చెబుతూ ట్విట్టర్‌లో (@IamShajanSamuel) పోస్టు షేర్ చేశారు.  ‘హీరాలాల్ లాంటి ఉద్యోగులు మీ కంపెనీకి అసెట్, హీరాలాల్ ఇంతకు ముందు కూడా ఇలాగే చేసారు, ఒక విదేశీయుడు తన వాలెట్ పోగొట్టుకున్నప్పుడు, అతను దానిని కూడా తిరిగి ఇచ్చాడు. మానవత్వం ఆయన రక్తంలోనే ఉంది. దయచేసి అతడిని బాగా చూసుకోండి’ అనే శీర్షికతో అతను పనిచేస్తున్న కంపెనీకి రిక్వెస్ట్ చేశారు.

Delhi Metro : ఢిల్లీ మెట్రోలో యువకుడిని తిట్టి, చెంప దెబ్బ కొట్టిన మహిళ వీడియో వైరల్

షాజన్ పోస్ట్‌పై నెటిజన్లు సైతం అభినందనలు తెలిపారు. ‘హీరాలాల్ కి అభినందనలు.. అతనికి ఏదైనా బహుమతి ఇవ్వండి’ అంటూ కామెంట్ చేశారు.