షేమ్..షేమ్ : రంజన్ గొగోయ్‌కి చేదు అనుభవం..ఆందోళనల మధ్య ప్రమాణ స్వీకారం

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కి చేదు అనుభవం ఎదురైంది. 2020, మార్చి 19వ తేదీ గురువారం రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆయన ప్రమాణం చేస్తున్న సమయంలో ప్రతిపక్షాలు పెద్దఎత్తున నినాదాలు చేశాయి. షేమ్ షేమ్..అంటూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు పలుమార్లు అభ్యంతరం తెలిపారు. నినాదాలు చేయవద్దని..సూచించారు. అయినా..ప్రతిపక్షాలు వినిపించుకోలేదు. ఈయన ప్రమాణ స్వీకారాన్ని నిరసిస్తూ…ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. గొగోయ్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రతిపక్షాలనుద్దేశించి వెంకయ్య నాయుడు పలు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి అధికారాలను ధిక్కరించి..సరికాదని సూచించారు. సభలో ఇలాంటి ఆందోళనలు, నినాదాలు చేయవద్దని, ఏవీ రికార్డులోకి రావని స్పష్టం చేశారు. ఏవైనా అభ్యంతరాలుంటే..పార్లమెంట్ బయట చెప్పుకోవచ్చన్నారు. (అయోధ్య తీర్పు ఇచ్చిన రంజన్ గోగోయ్‌కి రాజ్యసభ)
రంజన్ గొగోయ్‌ని రాజ్యసభకు నామినేట్ చేస్తూ…రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. అనంతరం రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేస్తూ..హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. నామినేట్ చేయగానే..విపక్షాల నుంచి పలు విమర్శలు చేశాయి. గతంలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చారని, అందుకే..రంజన్ గొగోయ్‌ని కేంద్రం రాజ్యసభకు పంపిందని విపక్షాలతో పాటు న్యాయమూర్తులు విమర్శలు గుప్పించారు.
* 2018 అక్టోబర్ 3 నుంచి 2019 నవంబర్ 17 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యామూర్తిగా గొగోయ్ పనిచేశారు.
* గత సంవత్సరం నవంబర్ 17వ తేదీన రిటైర్ అయ్యారు.
* 1978లో గొగోయ్ బార్ కౌన్సిల్‌లో చేరి లాయర్‌గా గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2001 ఫిబ్రవరి 28న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులైయ్యారు.
* జస్టిస్ గొగోయ్ 2012 ఏప్రిల్‌లో సర్వోన్నత న్యాయస్థానంలో పదోన్నతి పొందారు. భారత 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ కొనసాగారు.
* అయోధ్య కేసు, 134 సంవత్సరాలుగా వివాదంలో ఉన్న రామజన్మభూమి – బాబ్రీ మసీదు భూమి విషయంలో ఆయన తీర్పునిచ్చారు.
* భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 80లోని క్లాజ్ (1)లోని నిబంధన ప్రకారం రంజన్ గొగోయ్‌ని రాష్ట్రపతి నామినేట్ చేశారు.
Read More : కరోనా..దేవుడా : ఖాళీగా గుళ్లు..చిల్కూరు బాలాజీ టెంపుల్ మూసివేత