నో రిలీఫ్ : చిదంబరానికి 4 రోజుల కస్టడీ పొడిగింపు

ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఆర్థిక మంత్రి చిదంబరాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.

  • Published By: veegamteam ,Published On : August 26, 2019 / 11:23 AM IST
నో రిలీఫ్ : చిదంబరానికి 4 రోజుల కస్టడీ పొడిగింపు

Updated On : August 26, 2019 / 11:23 AM IST

ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఆర్థిక మంత్రి చిదంబరాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.

ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి సీబీఐ ప్రత్యేక కోర్టు కస్టడీ పొడిగించింది. ఈ కేసులో విచారణకు సీబీఐ ప్రత్యేక కోర్టులో చిదంబరం హాజరుపరిచారు. ఇప్పటి వరకూ చిదంబరానికి విధించిన ఐదురోజుల సీబీఐ కస్టడీ సోమవారంతో ముగిసింది. దీంతో కస్టడీని పొడిగించాలని సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది. కానీ, ప్రత్యేక కోర్టు చిదంబరానికి 4 రోజుల సీబీఐ కస్టడీ పొడిగించింది. ఆగస్టు 30 వరకు సీబీఐ చిదంబారాన్ని విచారించనుంది.    

INX మీడియా కేసులో నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ అయిన చిదంబరం ఐదు రోజుల నుంచి సీబీఐ అధికారులు కష్టడీలోనే ఉన్నారు. ఇప్పటికే చిదంబరం బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. INX మీడియా కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీం తేల్చిచెప్పింది. సీబీఐ అరెస్ట్ విషయంలో తలదూర్చలేమని స్పష్టం చేసింది.

సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దరఖాస్తు చేసుకోవాలని సుప్రీం సూచించింది. చిదంబరం ఇప్పటికే ఆరెస్ట్ అయినందున పిటిషన్ చెల్లదని తెలిపింది. చిదంబరం అరెస్ట్‌కు వ్యతిరేకంగా ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఆయన అరెస్టు కావడానికి ముందే పిటిషన్ దాఖలు చేశామని చిదంబరం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అరెస్టు తర్వాత దాఖలు చేసిన పిటిషన్ ఇంకా లిస్టు కాలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

సీబీఐ కస్టడీని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై తర్వాత విచారణ చేపడుతామని కోర్టు స్పష్టం చేసింది. చిదంబరంపై జరుగుతున్న విచారణ నిబంధనలకు విరుద్దంగా ఉందని మరో లాయర్ అభిషేక్ మనుసింఘ్వి వాదనాలు వినిపించారు. ఈ వాదనల్ని ధర్మాసనం తోసిపుచ్చింది. చిదంబరానికి బెయిల్ కోసం ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కపిల్ సిబల్, సల్మాన్ ఖుర్షీద్, అభిషేక్ సింఘ్వీ బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.