బాత్ రూంలో పడిన దేవెగౌడ.. ఆస్పత్రిలో చికిత్స

మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు హెచ్ డీ దేవెగౌడ (85) బాత్ రూంలో జారిపడ్డారు. ఈ ఘటనలో ఆయన కుడికాలికి గాయమైంది.

  • Published By: sreehari ,Published On : February 2, 2019 / 01:59 PM IST
బాత్ రూంలో పడిన దేవెగౌడ.. ఆస్పత్రిలో చికిత్స

Updated On : February 2, 2019 / 1:59 PM IST

మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు హెచ్ డీ దేవెగౌడ (85) బాత్ రూంలో జారిపడ్డారు. ఈ ఘటనలో ఆయన కుడికాలికి గాయమైంది.

మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు హెచ్ డీ దేవెగౌడ (85) బాత్ రూంలో జారిపడ్డారు. ఈ ఘటనలో ఆయన కుడికాలికి గాయమైంది. పద్మనాభ నగర్ లోని తన నివాసంలోని శనివారం ఉదయం బాత్ రూంలోకి వెళ్లిన సమయంలో దేవెగౌడ ప్రమాదవశాత్తూ జారిపడినట్టు జేడీఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాలికి గాయం కావడంతో  దేవెగౌడ అతికష్టంమీద నడుస్తున్నట్టు వ్యక్తిగత సహాయకుడు ఒకరు మీడియాకు తెలిపారు. విషయం తెలుసుకున్న దేవెగౌడ కుమారుడు డాక్టర్ రమేష్  వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. 

అనంతరం జేడీయూ అధ్యక్షుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరీక్షించిన ఆస్పత్రి వైద్యులు దేవెగౌడకు చిన్న గాయమే అయిందని, కుడి మోకాలు కొంచెం బెణికిందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దేవెగౌడ కాలి గాయానికి సంబంధించి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించినట్టు తెలిపారు. కొన్నిరోజులు దేవెగౌడ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.