Donald Trump Praises PM Modi: ఇండియాకు నేనే మంచి స్నేహితుడిని.. మోదీపై ప్రశంసలు కురిపించిన ట్రంప్

ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారని అన్నారు.

Donald Trump Praises PM Modi: ఇండియాకు నేనే మంచి స్నేహితుడిని.. మోదీపై ప్రశంసలు కురిపించిన ట్రంప్

Former US President Donald Trump,

Updated On : September 8, 2022 / 3:30 PM IST

Donald Trump Praises PM Modi: ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారని అన్నారు. భారతదేశానికి నా కంటే మంచి స్నేహితుడు ఎవ్వరూ లేరంటూ వ్యాఖ్యానించారు. ప్రెసిడెంట్ జో బిడెన్, మాజీ ప్రెసిడెంట్ ఒరాక్ ఒబామా వంటి ఇతరులకంటే తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్న హయాంలోనే భారత్, అమెరికా సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు.

Trump’s India visit: 2020లో డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందంటే..?

భారత్ ప్రధాని పదవిని నిర్వహించడం ఆషామాషీ కాదని, మోదీ అద్భుతంగా పాలిస్తున్నారని, మోదీ చాలా మంచి వ్యక్తి అంటూ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు.. ప్రతి ఒక్కరూ నన్ను పోటీ చేయాలనుకుంటున్నారు. సమీప భవిష్యత్తు లో నేను ఒక నిర్ణయానికి వస్తానని చెబుతూనే 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల బరిలో తాను నిలబడబోతున్నానని ట్రంప్ సంకేతాలిచ్చాడు. అన్ని పోల్స్ లోనూ తాను లీడింగ్ లో ఉన్నానని ట్రంప్ తెలిపారు.