Delhi-Jaipur Highway : కారు, వ్యాన్లను ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్…నలుగురి మృతి
ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ-జైపూర్ హైవేపై వేగంగా వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ కారు, పికప్ వ్యాన్‌ను ఢీకొనడంతో నలుగురు మరణించారు.....

Road Accident
Delhi-Jaipur Highway : ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ-జైపూర్ హైవేపై వేగంగా వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ కారు, పికప్ వ్యాన్‌ను ఢీకొనడంతో నలుగురు మరణించారు. హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ సమీపంలో ఢిల్లీ-జైపూర్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ముగ్గురు ప్రయాణికులు ఉన్న కారును ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో మంటలు చెలరేగి మృతి చెందారు.
వాహనంలో సీఎన్‌జీ సిలిండర్లు ఉండడంతో మంటలు చెలరేగాయని పోలీసు అధికారి వినోద్ కుమార్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులు జైపూర్‌కు వెళుతున్నారు. కారును ఢీకొట్టిన తర్వాత ఆయిల్ ట్యాంకర్ హైవేపై పికప్ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ALSO READ : Deepavali : దీపావళి సందర్భంగా క్రాకర్ టైమ్ ఇదే…బాంబే హైకోర్టు సంచలన ఆదేశం
ప్రమాదం జరిగిన తర్వాత ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాద ఘటన గురించి తమకు సమాచారం అందగానే సంఘటన స్థలానికి వెళ్లగా కారు మంటల్లో ముగ్గురు సజీవ దహనమయ్యారని పోలీసులు చెప్పారు.
ALSO READ : Karnataka BJP chief : యెడియూరప్ప తనయుడికి కర్ణాటక బీజేపీ పగ్గాలు
ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడం వల్ల వ్యాన్ డ్రైవరు మరణించాడని పోలీసు అధికారి కుమార్ పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు వివరించారు.