Bokaro Coal Mine : చోరీకి వెళ్తే ప్రాణం పోయేంత పనైంది

బొగ్గుగనిలో అక్రమ తవ్వకాలకు వెళ్లిన అరుగులు వ్యక్తులు ప్రమాదవశాత్తు చిక్కుకుపోయారు. ఎలాగోలా కష్టపడి ఇద్దరు వ్యక్తులు బయటకు రాగ.. మరో నలుగురు 20 గంటలు శ్రమించి బయటపడ్డారు.

Bokaro Coal Mine : చోరీకి వెళ్తే ప్రాణం పోయేంత పనైంది

Bokaro Coal Mine

Updated On : November 29, 2021 / 5:17 PM IST

Bokaro Coal Mine : బొగ్గుగనిలో అక్రమ తవ్వకాలకు వెళ్లిన అరుగులు వ్యక్తులు ప్రమాదవశాత్తు చిక్కుకుపోయారు. ఎలాగోలా కష్టపడి ఇద్దరు వ్యక్తులు బయటకు రాగ.. మరో నలుగురు 20 గంటలు శ్రమించి బయటపడ్డారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. బొకారో జిల్లాలోని భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) చెందిన వదిలేసిన గనిలో చందన్‌కియారి బ్లాక్‌లోని తిలతాండ్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులు అక్రమంగా తవ్వకాలు జరిపారు. ఇదే సమయంలో గనిలోని ఓ భాగం కూలి బయటకి వచ్చే మార్గానికి అడ్డంగా పడిపోయింది.

చదవండి :   బొగ్గు గనిలో భారీ పేలుడు..52 మంది దుర్మరణం..పెరగనున్న మృతుల సంఖ్య

దీంతో ఆరుగురు అందులో చిక్కుకుపోయారు.. వీరిలో ఓ ఇద్దరు ఎలాగోలా బయటపడి అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బీసీసీఎల్‌ అధికారులు లక్ష్మణ్ రాజ్వర్ (42), అనాది సింగ్ (45), రావణ రాజ్వర్ (46), భరత్ సింగ్ (45) కోసం రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించారు. అయితే ఎంత శ్రమించిన వారిని బయటకు తీసుకురావడం అధికారుల వల్లకాలేదు. దీంతో NDRF సిబ్బందిని రంగంలోకి దింపారు. ఓ వైపు NDRF సహాయక చర్యలు చేస్తుండగానే మరో వైపు గనిలోని నలుగురు బయటపడేందుకు 20 గంటలపాటు తవ్వి సోమవారం తెల్లవారుజామున 3.30సమయంలో బయటపడ్డారు.

చదవండి : సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం… కార్మికుడు మృతి

సురక్షితంగా గని నుంచి బయటకు వచ్చారని బొకారో జిల్లా ఎస్పీ చందన్ కుమార్ ఝా తెలిపారు. అయితే గనిలో అక్రమ తవ్వకాలు జరిపి చిక్కుకున్న వారిపై చర్యలకు బీసీసీఎల్‌ యాజమాన్యం మౌనంగా ఉందన్నారు.