Ambulance Hit Toll Plaza : టోల్‌ ప్లాజాను ఢీకొట్టిన అంబులెన్స్..రోగి సహా నలుగురు మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్‌ టోల్‌ ప్లాజాను ఢీకొట్టడంతో రోగి సహా నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో అంబులెన్స్ లోని రోగి, ఇద్దరు సహాయకులు, టోల్‌ ప్లాజా సిబ్బంది సహా నలుగురు మరణించారు.

Ambulance Hit Toll Plaza : టోల్‌ ప్లాజాను ఢీకొట్టిన అంబులెన్స్..రోగి సహా నలుగురు మృతి

Ambulanee

Updated On : July 20, 2022 / 8:27 PM IST

ambulance hit toll plaza : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్‌ టోల్‌ ప్లాజాను ఢీకొట్టడంతో రోగి సహా నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో అంబులెన్స్ లోని రోగి, ఇద్దరు సహాయకులు, టోల్‌ ప్లాజా సిబ్బంది సహా నలుగురు మరణించారు. ఈ విషాద ఘటన ఉడిపి జిల్లాలో చోటు చేసుకుంది.

బుధవారం(జులై20,2022) కుందాపురం నుంచి ఒక రోగిని అంబులెన్స్‌లో హొన్నవర ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే జోరు వర్షంలో కూడా ఆ అంబులెన్స్‌ వేగంగా ప్రయాణిస్తోంది. బైందూరు సమీపంలోని టోల్‌ ప్లాజా సిబ్బంది అంబులెన్స్‌ను గమనించారు. ప్రత్యేక లైన్‌లో దానికి దారి ఇచ్చేందుకు ప్రయత్నించారు. అడ్డుగా ఉన్న ప్లాస్టిక్‌ బారికేడ్లను వేగంగా తొలగించారు.

Uttar Pradesh : డీసీఎం‌ను ఢీకొన్న అంబులెన్స్-ఏడుగురు మృతి

అయితే వర్షానికి టోల్‌ ప్లాజా వద్ద రోడ్డు బాగా తడిసి ఉంది. కాగా, అంబులెన్స్‌ అత్యంత వేగంగా రావడంతో ఆ లైన్‌ నుంచి వెళ్లేందుకు ప్రయత్నించి అదుపు తప్పింది. వాహనం చక్రాలు రోడ్డుపై జారాయి. దీంతో అంబులెన్స్ వేగంగా టర్న్‌ అయ్యి టోల్‌ ప్లాజా క్యాబిన్‌ను బలంగా ఢీకొట్టి, బొల్తా కొట్టింది. దీంతో అంబులెన్స్‌లో ఉన్న రోగి, ఇద్దరు సహాయకులు వాహనం నుంచి రోడ్డుపైకి ఎగిరి పడి మృతి చెందారు.

అలాగే అంబులెన్స్ ఢీకొట్టడంతో ఒక టోల్‌ ప్లాజా సిబ్బంది కూడా చనిపోయారు. తీవ్రంగా గాయపడిన అంబులెన్స్ డ్రైవర్‌ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాద ఘటన చాలా బీభత్సంగా, ఒళ్లు జలదరించేలా ఉంది. మరోవైపు అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.