Kashmir : ఎంత చూసినా తనివి తీరని లోయ అందాలు.. భూలోక స్వర్గానికి మళ్లీ మంచి రోజులు

కశ్మీర్ అనేది కేవలం ఓ డెస్టినేషన్ కాదు. అదో.. ప్రత్యేకమైన అనుభవం. ప్రతి ఒక్కరినీ ఆకర్షించే ఎలిమెంట్.. కశ్మీర్‌లో ఉంది. ఆల్ఫైన్ అడవులు, నీటి ప్రవాహాల లాంటి వాటితో.. కశ్మీర్ ఇప్పుడు అత్యద్భుతంగా కనిపిస్తోంది.

Kashmir : ఎంత చూసినా తనివి తీరని లోయ అందాలు.. భూలోక స్వర్గానికి మళ్లీ మంచి రోజులు

Updated On : May 25, 2023 / 6:14 PM IST

Kashmir Tourism – కశ్మీర్ మారిపోయింది. మారడమంటే.. వెదర్‌లో మార్పు కాదు. అక్కడి పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. మళ్లీ టూరిస్టులతో వ్యాలీ అంతా కళకళలాడుతోంది. ఎప్పుడేం జరుగుతుందో అనే భయాల్లేవు. ఎప్పుడూ కర్ఫ్యూ పెడతారో అనే అనుమానాలు అవసరం లేదు. ఇప్పుడు కశ్మీర్ వెళితే.. తనివితీరా లోయ అందాల్ని చూడొచ్చు. ఆస్వాదించొచ్చు. సినిమా షూటింగులకు కూడా అనువైన లొకేషన్లు కశ్మీర్‌లో మళ్లీ తెరచుకుంటున్నాయి. ఇప్పుడు.. కశ్మీర్ జస్ట్ టూరిస్ట్ ప్లేస్ మాత్రమే కాదు. టూరిజం హబ్ (Tourism hub) కూడా. ఇదే విషయంలో.. కశ్మీర్‌ని ఇంకా డెవలప్ చేసే ప్రయత్నాల్లో ఉంది కశ్మీర్.

ఇండియా (India)లో.. ఇప్పుడూ.. ఎప్పుడూ.. కశ్మీరే.. ది బెస్ట్ టూరిజం స్పాట్ (Tourism Spot). అక్కడి అందాలను చూసేందుకు.. రెండు కళ్లూ చాలవు. అక్కడి ప్రకృతి రమణీయతను వర్ణించడానికి పదాలు సరిపోవు. అందుకే.. కశ్మీర్‌ని భూతల స్వర్గంగా చెబుతారు. ఈ భారత నేలపై.. అద్భుతమైన నేలగా వర్ణిస్తారు. మంచు కురిసినా.. కురవకపోయినా.. కశ్మీర్ అందం ఎన్నటికీ తగ్గదు. అక్కడి వాతావరణంలో పెద్దగా మార్పు ఉండదు. ఆ చల్లని ప్రదేశానికి వెళితే తెలియని అనుభూతి కలుగుతుంది. మాటల్లో చెప్పలేని ఫీలింగ్ వస్తుంది. కళ్లతో కాదు.. మనసు పెట్టి చూస్తే.. కామన్ పీపుల్ కూడా కశ్మీర్‌పై కవిత్వం రాసేస్తారు. అలా ఉంటుంది కశ్మీర్. అందుకే.. దేశంలోనే అల్టిమేట్ టూరిజం స్పాట్‌గా మారిపోయింది. ఇప్పుడు.. జీ20 సన్నాహక మీటింగ్‌తో.. మరోసారి కశ్మీర్ టూరిజం ఇండియా వైడ్ హాట్ టాపిక్‌గా మారింది. విదేశీ ప్రతినిధులంతా.. కశ్మీర్ అందాల్ని చూసి ముగ్ధులైపోతున్నారు. నిజానికి.. జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్ కావాలనే శ్రీనగర్‌లో పెట్టారు. అక్కడైతేనే.. ఇండియన్ టూరిజం, ఇక్కడి కల్చర్ ఏమిటో.. విదేశీ ప్రతినిధులకు అర్థమవుతుంది.

ఆర్టికల్ 370 రద్దుతో మారిన పరిస్థితులు
ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరూ చూడాలనుకునే ప్రకృతి అందం.. వెళ్లాలనుకునే ప్రదేశం.. కశ్మీర్ ఒక్కటే. కానీ.. అక్కడి సరిహద్దుల్లో ఉండే పరిస్థితులు.. కశ్మీర్ వైపు చూడాలంటేనే.. ఒకటికి రెండు సార్లు ఆలోచించేలా చేశాయ్. అక్కడ సీనరీ ఎంత బాగున్నా.. అక్కడికి వెళ్లాక.. ఎలాంటి సీన్ చూడాల్సి వస్తుందనో.. ఎలాంటి సీన్లు కనిపిస్తాయనో.. టెన్షన్ చాలా మందిలో ఉండేది. కానీ.. 2019లో ఆర్టికల్ 370 రద్దుతో.. కశ్మీర్‌లో పరిస్థితులు మారిపోయాయ్. గడిచిన నాలుగేళ్లలో.. టూరిజం బాగా డెవలప్ అయింది. గత రెండేళ్లుగా.. కశ్మీర్‌ చూసేందుకు వస్తున్న పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది. గతేడాది మొత్తంగా.. కోటీ 88 లక్షల మందికి పైనే టూరిస్టులు వచ్చినట్లు.. సర్కార్ గణాంకాలు చెబుతున్నాయ్.

పర్యాటకులు పెరిగారు
కశ్మీర్ అందాల్ని చూసేందుకు.. వాటిని ఆస్వాదించేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరగడంతో.. లోకల్ వ్యాపారాలు, ట్రావెల్స్ పరిశ్రమ (Travel Industry) కు బాగా ప్లస్ అయింది. చాలా మంది.. ఇప్పుడు.. ఆశించిన స్థాయిలో వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయని చెబుతున్నారు. టూరిజం విషయంలో.. కశ్మీర్‌లో చాలా మార్పు కనిపిస్తోంది. 2021, 2022లోనూ.. కోట్లాది మంది టూరిస్టులు కశ్మీర్ చూసేందుకు వెళ్లారు. ఇప్పుడు కూడా వేలాది మంది పర్యాటకులు కశ్మీర్‌లోనే ఉన్నారు. అక్కడి అందాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆర్టికల్ 370 (Article 370) రద్దు తర్వాత.. కశ్మీర్‌లో మొత్తం సీనే మారిపోయింది. ఇక్కడి.. టూరిజం స్పాట్‌లను ప్రభుత్వం బాగా డెవలప్ చేసింది. మరింత.. అందంగా తీర్చిదిద్దారు. జెలూం-రాజ్ బాగ్ రివర్ ఫ్రంట్‌ని చూసేందుకు.. గవర్నమెంట్ రీవ్యాంప్ చేశాక.. ఆ ప్రదేశం అద్భుతంగా కనిపిస్తోంది. ఆరు కిలోమీటర్ల మేర చేపట్టిన రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్.. శ్రీనగర్ స్మార్ట్ సిటీ లిమిటెడ్ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు.. దానిని చూసేందుకు.. టూరిస్టులు బాగా వస్తున్నారు.

ఇక.. కశ్మీర్ తులిప్ గార్డెన్ (kashmir tulip garden) కూడా టూరిస్టులను బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ ఇది. కశ్మీర్‌లో బాగా పాపులర్ టూరిస్ట్ ప్లేస్. దాల్ లేక్‌కి దగ్గరగా ఉండటంతో.. చాలా మంది పర్యాటకులు.. ఈ ప్రదేశాన్ని చూసేందుకు తరలి వస్తున్నారు. 68 రకాల తులిప్ పువ్వుల అందాల్ని చూస్తూ.. తమను తాము మైమరచిపోతున్నారు. ఇక్కడున్న 15 లక్షల తులిప్ ఫ్లవర్స్.. టూరిస్టులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయ్.

కశ్మీర్ సూపర్బ్
ప్రస్తుతం.. శ్రీనగర్‌లో జీ20 సదస్సు సన్నాహక టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్ జరుగుతోంది. ఆర్టికల్ 370 రద్దు చేశాక.. కశ్మీర్‌లో జరుగుతున్న హైలెవెల్ మీటింగ్ ఇదే. ఇప్పుడు.. ఆ సదస్సుకు వచ్చిన విదేశీ ప్రతినిధులందరినీ.. కశ్మీర్ అందాలు కట్టి పడేస్తున్నాయ్. భారత అధికారులు కూడా.. సమ్మిట్‌లో కశ్మీర్.. సినిమా షూటింగులకు ది బెస్ట్ ప్లేస్ అని చెబుతున్నారు. ఇప్పుడు.. కశ్మీర్ అనేది కేవలం ఓ డెస్టినేషన్ కాదు. అదో.. ప్రత్యేకమైన అనుభవం. ప్రతి ఒక్కరినీ ఆకర్షించే ఎలిమెంట్.. కశ్మీర్‌లో ఉంది. ఆల్ఫైన్ అడవులు, నీటి ప్రవాహాల లాంటి వాటితో.. కశ్మీర్ ఇప్పుడు అత్యద్భుతంగా కనిపిస్తోంది. కశ్మీర్ కంటే బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ ఇండియాలో మరొకటి లేదు. ఎన్ని ఉన్నా.. అవన్నీ కశ్మీర్ కిందే అనే స్టేట్‌మెంట్లు, కామెంట్లు కూడా వినిపిస్తున్నాయ్. ఫిల్మ్ మేకర్స్ కూడా.. కశ్మీర్ సూపర్బ్ లొకేషన్ అంటున్నారు. ఇక.. జీ20 సన్నాహక సదస్సుకు హాజరైన విదేశీ ప్రతినిధులంతా.. బ్యూటిఫుల్ దాల్ లేక్‌ (Dal Lake)లో బోట్ షికారు చేస్తూ.. కశ్మీర్ అందాలను ఆస్వాదించారు.

Also Read: ఆలింగనాలతో దేశాధినేతలను కట్టిపడేసిన ప్రధాని.. మోదీ హగ్‌ దౌత్యం ఫలిస్తుందా?

త్వరలోనే.. కేంద్ర ప్రభుత్వం.. నూతన జాతీయ పర్యాటక విధానాన్ని ప్రకటించబోతుందని.. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. అంతేకాదు.. గ్లోబల్ టూరిజం ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ని నిర్వహించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తోందన్నారు. ముఖ్యంగా.. ఆధ్మాత్మిక పర్యాటకానికి కశ్మీర్‌లో అద్భుతమైన అవకాశాలున్నాయన్నారు కిషన్ రెడ్డి. టూరిజం డెవలప్‌మెంట్ కోసం.. వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం అనుమతిస్తోందని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు కశ్మీర్‌ని చూడాలంటే.. అక్కడ ఎప్పుడేం జరుగుతుందోనని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకప్పటి కశ్మీర్‌కి.. ఇప్పటికి చాలా మార్పు కనిపిస్తోంది.

గడిచిన నాలుగేళ్లలో కశ్మీర్‌లో నివసిస్తున్న ప్రజల్లోనూ మార్పు వచ్చింది. మునుపటిలా.. బంద్‌ పిలుపులకు స్పందించడం లేదు. కర్ఫ్యూలు తగ్గిపోయాయ్. హర్తాళ్ చేపట్టాలని ఎవరు పిలుపునిచ్చినా.. లోకల్ పబ్లిక్ పట్టించుకోవడం లేదు. ఉగ్రవాదం కారణంగా.. ఇప్పటికే కొన్ని తరాలు నష్టపోయిన విషయం ప్రజలు తెలుసుకున్నారు. ఏదో విధంగా.. తమ ప్రాంతం అభివృద్ధి చెందితే చాలనుకుంటున్నారు. ముఖ్యంగా.. టూరిజం రంగం ద్వారా మంచి ఉపాధి పొందేందుకు కశ్మీర్‌లో ఉన్న అవకాశాలన్ని వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఇవన్నీ.. కశ్మీర్‌లో పరిస్థితులు మారాయని చెప్పడానికున్న లేటెస్ట్ ఎగ్జాంపుల్స్.

నాలుగేళ్లలో.. కశ్మీర్‌లో అంతగా ఏం మారింది.. వివరాలకు ఈ క్రింది వీడియో చూడండి..