G20 Summit 2023: జీ20 సదస్సులో ఏఏ దేశాధినేతలు పాల్గొంటున్నారో తెలుసా? రేపు ఢిల్లీ చేరుకోనున్న అమెరికా ప్రెసిడెంట్

ఢిల్లీలో జరిగే జీ20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరుకావడం లేదు. ఇటలీ ప్రధాని, ఇండోనేషియా అధ్యక్షుడు, మెక్సికో అధ్యక్షుడు, ఐరోపా యూనియన్ అధ్యక్షురాలు ..

G20 Summit 2023: జీ20 సదస్సులో ఏఏ దేశాధినేతలు పాల్గొంటున్నారో తెలుసా? రేపు ఢిల్లీ చేరుకోనున్న అమెరికా ప్రెసిడెంట్

G20 Summit 2023

Updated On : September 6, 2023 / 1:38 PM IST

G20 Summit 2023 In Delhi: ప్రపంచ ఆర్థిక సవాళ్లపై చర్చించే జీ-20 సదస్సుకు సర్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 9,10 తేదీల్లో ఢిల్లీ వేదికగా G20 శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. ప్రపంచ దేశాధినేతలు G20 శిఖరాగ్ర సమావేశాలకు వస్తుండటంతో ప్రభుత్వం పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ సమావేశాలకు జీ20 దేశాధినేతలు ,అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఢిల్లీ చేరుకుంటున్నారు. రేపు (గురువారం) అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఢిల్లీకి చేరుకోనున్నారు.

G20 Summit 2023 : సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు .. కేవలం ఆ దుకాణాల నిర్వహణకు మాత్రమే అనుమతి

ఈనెల 9, 10 తేదీల్లో ఢిల్లీ వేదికగా జరిగే జీ20 సమావేశాలకు వివిధ దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. వీరిలో.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంధోనీ ఆల్బనిస్, కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, జపాన్ ప్రధాని పుమియో కిషిద, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యేల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మన్యుయేల్ మెక్రన్, చైనా ప్రధాని లీ చియాంగ్, రష్యా విదేశాంగ మంత్రి లాల్ సెర్గి లావ్రోర్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్, అర్జెంటీనా అధ్యక్షుడు ఫెర్నాండెజ్, నైజీరియా అధ్యక్షుడు బొలా తినుబు, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరీల్ రమఫోసాలు హాజరవుతారు.

US President Joe Biden: కొవిడ్ నెగిటివ్ వచ్చింది..! బైడెన్ భారత పర్యటనకు లైన్ క్లియర్.. కానీ, ఆ నిబంధనలు పాటిస్తారట..

అదేవిధంగా ఢిల్లీలో జరిగే జీ20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరుకావడం లేదు. ఇటలీ ప్రధాని, ఇండోనేషియా అధ్యక్షుడు, మెక్సికో అధ్యక్షుడు, ఐరోపా యూనియన్ అధ్యక్షురాలుకూడా ఈ జీ20 సమావేశాలకు గైర్హాజరవుతారని తెలిసింది. మరోవైపు ఢిల్లీలో జీ20 సమావేశాల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఢిల్లీకి వచ్చే వివిధ దేశాల ప్రతినిధులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా దేశ రాజధానిలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.