Supriya Sule : బీజేపీలో నిజాలు మాట్లాడే ఏకైక వ్యక్తి నితిన్ గడ్కరీ ఒక్కరే : సుప్రియా సూలే
బీజేపీలో నిజాలు మాట్లాడే ఏకైక వ్యక్తి నితిన్ గడ్కరి ఒక్కరే అంటూ నేషనలిస్ట్ కాంగ్రెస్ ఎంపీ సుప్రియా సూలే వ్యాఖ్యానించారు.

MP Supriya Sule Minister nitin gadkari
Nationalist Congress Party MP Supriya Sule : బీజేపీలో నిజాలు మాట్లాడే ఏకైక వ్యక్తి నితిన్ గడ్కరి ఒక్కరే అంటూ నేషనలిస్ట్ కాంగ్రెస్ ఎంపీ సుప్రియా సూలే వ్యాఖ్యానించారు. ఆదివారం పూణెలో మీడియా సమావేశంలో అసలైన శివసేన గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన ప్రకటనపై స్పంచిన ఆమె మాట్లాడుతు..మహారాష్ట్రలో బాలాసాహెబ్ థాకరే ఏర్పాటు చేసిన శివసేన ఒక్కటేనని అన్నారామె. తన దృష్టిలో మహారాష్ట్రలో దివంగత బాలా సాహెబ్ స్థాపించిన పార్టీ ఒకే ఒక్కటని అది శివసేన అని ఆయన జీవించి ఉన్నప్పుడే పార్టీ బాధ్యతలను ఉద్ధవ్ ఠాక్రేకు అప్పగించారని ప్రస్తుతం డూప్లికేట్ సేనలు తయారయ్యాయని వ్యాఖ్యానించారు.
ఇత్తడి (కాంస్యం) పుత్తడి (బంగారం)కి మద్య ఉండే తేడాలను ప్రజలు చక్కగా గుర్తిస్తారని అన్నారు. మహారాష్ట్రలో పాలన లేదు అంటూ సీఎం ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంపై మండిపడ్డారు.విధాన నిర్ణయాలు తీసుకోవడంలో నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నారని అన్నారు.
Raas Festival : రూ.100లకే రేంజ్‌రోవర్, ఫార్చ్యూనర్, స్కోడా కార్లు .. ఎగబడి కొనేస్తున్న జనాలు
ఈ సందర్భంగా సుప్రియా సులే మరాఠా రిజర్వేషన్లపై కూడా మాట్లాడుతు..మహారాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. మరాఠా రిజర్వేషన్లపై మరాఠా కోటా ఉద్యమకారుడు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన 40 రోజుల డెడ్‌లైన్ ముగిసిన అనంతరం సుప్రియా సూలే ఈ వ్యాఖ్యలు చేయటం గమనించాల్సిన విషయం.