Gas Leak : తమిళనాడులోని కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్..ఒకరి మృతి

తమిళనాడులో ఈరోడ్ లోని కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉంది.

Gas Leak : తమిళనాడులోని కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్..ఒకరి మృతి

Gas Leak

Updated On : December 11, 2021 / 10:29 PM IST

Gas leak at a chemical factory : తమిళనాడులో ఈరోడ్ లోని కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం..చెన్నై చిటోడే జిల్లాలోని ఓ ప్రైవేట్ కెమికల్ ఫ్యాక్టరీలో క్లోరిన్ వాయువు లీక్ అయింది.

దీంతో ఫ్యాక్టరీ యజమాని దామోదర్ (43) మృతి చెందాడు. మరో 13 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సిలిండర్ లో గ్యాస్ ను రీఫిల్ చేస్తున్న సమయంలో గ్యాస్ లీకేజ్ జరిగినట్లు సమాచారం.

Corona In Telangana : తెలంగాణలో కొత్తగా 188 కరోనా కేసులు, ఒకరు మృతి

అయితే ఈ గ్యాస్ ను మొత్తం 20 మంది కార్మికులు పీల్చుకున్నారు. వీరిలో 13 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.