Guwahati High Court: బుల్డోజర్ల కూల్చివేతలపై హైకోర్టు సీరియస్.. ఇదేం సంస్కృతి అంటూ ప్రభుత్వానికి తలంటు
ఎస్పీ అయినంత మాత్రాన ఇళ్లు కూల్చమని ఆదేశాలు ఎలా ఇస్తారు? మనం ప్రజాస్వామిక పద్దతిలో ఉన్నాం. కనీసం సెర్స్ వారెంట్ జారీ చేయకుండా ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? పోలీసు విభాగానికి పెద్ద అయినంత మాత్రాన ఎవరి ఇల్లు అయినా ఇలా కూలగొట్టొచ్చని భావిస్తారా? ఇలాంటి చర్యలకు అనుమతి ఇస్తే దేశంలో ఎవరూ భద్రంగా ఉండరు

Gauhati HC says Bulldozing of houses in name of investigation not provided under law
Guwahati High Court: బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేయడంపై గువహాటి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా ఇళ్లను కూల్చేయమని ఏ సంస్కృతి చెప్పిందని అస్సాం ప్రభుత్వానికి, పోలీసు విభాగానికి తలంటు పోసింది. కేసులు దర్యాప్తులో ఉండగా నిందితులపై ఇలాంటి చర్యలు తీసుకోవడమేంటని, ఇలా ఏ చట్టం చెబుతోందని సూటిగా ప్రశ్నించింది. పోలీస్ స్టేషన్ తగలబెట్టిన కేసులో అరెస్ట్ చేసిన ఐదుగురి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేశారు. అయితే ఈ విషయాన్ని సుమోటోగా తీసుకున్న గువహాతి హైకోర్టు.. గురువారం విచారణ అనంతరం స్పందిస్తూ తీవ్రంగా వ్యాఖ్యానించింది.
‘‘కేసు దర్యాప్తులో ఉండగా, పోలీసులు ఎటువంటి ఆదేశాలు లేకుండా ఒక వ్యక్తి ఆస్తులపై బుల్డోజర్ ప్రయోగించవచ్చని మీరు (అస్సాం ప్రభుత్వం) ఏదైనా చట్టంలో చూపిస్తారా? ఏ చట్టం చెబుతోంది, ఇలా బుల్డోజర్లతో ఇళ్లు కూల్చమని? మెకాలే తీసుకొచ్చిన నేర విచారణ చట్టంటోనూ దీని ప్రస్తావన లేదు కదా’’ అని కోర్టు ప్రశ్నించింది. ఇక ఇళ్ల కూల్చివేతకు ఆదేశాలిచ్చిన పోలీసు అధికారిపై కోర్టు స్పందిస్తూ ‘‘ఎస్పీ అయినంత మాత్రాన ఇళ్లు కూల్చమని ఆదేశాలు ఎలా ఇస్తారు? మనం ప్రజాస్వామిక పద్దతిలో ఉన్నాం. కనీసం సెర్స్ వారెంట్ జారీ చేయకుండా ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? పోలీసు విభాగానికి పెద్ద అయినంత మాత్రాన ఎవరి ఇల్లు అయినా ఇలా కూలగొట్టొచ్చని భావిస్తారా? ఇలాంటి చర్యలకు అనుమతి ఇస్తే దేశంలో ఎవరూ భద్రంగా ఉండరు’’ అని కోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది.
బటద్రవ పోలీస్ స్టేషన్లో సఫికుల్ ఇస్లాం అనే వ్యక్తి పోలీస్ కస్టడీలో మరణించాడు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక ముస్లింలు.. మే 21వ తేదీన పోలీస్ స్టేషన్‌కు నిప్పంటించారు. కాగా, ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మరుసటి రోజే ఆ ఐదుగురి ఇళ్లు నేలమట్టమయ్యాయి.
Gujarat Polls: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగిన కూలీ.. డిపాజిట్‌గా 10 వేల రూపాయి నాణేలు