ముగిసిన 3వ విడత పోలింగ్: గుజరాత్‌లో భారీగా తగ్గిన ఓటింగ్

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన మూడో దశ పోలింగ్ ముగిసింది. పశ్చిమ్ బంగ, యూపీ మినహా మిగతా రాష్ట్రాల్లో 3వ విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు కొనసాగింది.
Also Read : జనసేన ఆఫీసులకు టూలెట్ బోర్డులు: స్పందించిన పవన్ కళ్యాణ్
ఆరు గంటల వరకు క్యూ లైన్లలో ఉన్నవారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 13రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 115నియోజవకర్గాల్లో పోలింగ్ జరిగింది.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4గంటలకే పోలింగ్‌ను ముగించారు అధికారులు. మూడవ విడత పోలింగ్‌లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ములాయం సింగ్, సామాజిక కార్యకర్త అన్నా హజారే, జయప్రద, సుప్రియా సూలె, శశిథరూర్, మల్లికార్జున్ ఖర్గే, గోవా సీఎం ప్రమోద్ సావంత్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Also Read : ఇదే బెస్ట్ ఆప్షన్ : బ్యాంకుల్లోని మీ బంగారం భద్రమేనా?
సాయంత్రం 5గంటల వరకు 61.31శాతం పోలింగ్ మూడవ విడత పోలింగ్‌లో నమోదైంది.
సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రాల వారీగా పోలింగ్:
అస్సాం- 74.05 శాతం
బీహార్- 54.95 శాతం
ఛత్తీస్‌ఘఢ్- 64.03 శాతం
గోవా- 70.96 శాతం
గుజరాత్- 58.81 శాతం
జమ్మూ కశ్మీర్- 12.46 శాతం
కర్ణాటక- 60.87 శాతం
కేరళ- 68.62 శాతం
మహారాష్ట్ర- 55.05 శాతం
ఒడిశా- 57.84 శాతం
త్రిపుర- 71.13 శాతం
ఉత్తరప్రదేశ్- 56.36 శాతం
పశ్చిమ బెంగాల్- 78.94 శాతం
దాద్రానగర్ హవేలీ- 71.43 శాతం
డామన్‌డయ్యూ- 65.34 శాతం