వారెవ్వా..! బుల్లెట్ పై అమ్మాయిల స్టంట్ వైరల్

వారెవ్వా..! బుల్లెట్ పై అమ్మాయిల స్టంట్ వైరల్

Ghaziabad Two Yong Girls For Doing Stunt On bullet bike

Updated On : March 17, 2021 / 1:22 PM IST

Ghaziabad two yong girls for doing stunt on Bullet bike : ఓ బుల్లెట్ బైక్ మీద ఇద్దరు అమ్మాయిలు విన్యాసాలు చేశారు. ఒకమ్మాయి బుల్లెట్ బైక్ నడుపుతుంటే..మరో అమ్మాయి బైక్ నడిపే అమ్మాయి బుజాలపై కూర్చుంది. బైక్ నడిపే అమ్మాయి భుజాలపై కూర్చున్న అమ్మాయిని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ గాల్లో తేలిపోతున్నట్లుగా దూసుకుపోయారు. ఈ ఇద్దరమ్మాయిలు బైక్ విన్యాసాలు చూడటానికి బాగానే ఉన్నా పోలీసులు మాత్రం ఊరుకోలేదు. ఇద్దరిమీదా యాక్షన్ తీసుకున్నారు. భారీగా జరిమానా వేశారు.

అమ్మాయిలిద్దరూ బైక్ స్టంట్‌ను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారి పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.యువతులను ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. హెల్మెట్ ధరించకపోవడం, అనుమతులు లేకుండా రేసింగ్‌ జరపడం సహా పలు డ్రైవింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు పోలీసులు ఆ బైక్ యజమానికి మొత్తం రూ. 11 వేలు చలాన్లు జారీ చేశారు.

ఈ వీడియోలో ఓ అమ్మాయి బుల్లెట్ బైక్‌ను నడిపిస్తూ… తన భుజాలపై మరో యువతిని కూర్చోబెట్టుకుని స్టంట్ చేసింది. ఎదురుగా వాహనాలు వస్తున్నప్పటికీ ఏమాత్రం బెరుకులేకుండా డ్రైవ్ చేస్తూ వెళ్లారు. స్థానిక జిమ్‌ పేరుతో టీ-షర్టులు ధరించిన వీరిద్దరూ.. కనీసం హెల్మెంట్లు కూడా పెట్టుకోలేదు.

ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఘజియాబాద్ పోలీసులు రూ. 11 వేలు జరిమాన విధించినట్టు ట్విటర్లో వెల్లడించారు. ‘‘ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. మీ జీవితాలను, ఇతరుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టకండి..’’ అని పోలీసులు వెల్లడించారు. ఈ స్టంట్ ను ఆ అమ్మాయిలు ప్రమోషన్ కోసం తీశారా? లేదా అడ్వంచర్ కోసం చేశారా? అనేది తెలియలేదు.