జమ్మూకశ్మీర్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన గిరీష్ చంద్ర

జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా గిరీష్ చంద్ర ముర్ము ఇవాళ(అక్టోబర్-31,2019) ప్రమాణస్వీకారం చేశారు. జమ్మూకశ్మీర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గీతా మిట్టల్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
గిరీష్ చంద్ర ముర్ము…1985 IAS బ్యాచ్ గుజరాత్ కేడర్ కు చెందిన వ్యక్తి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో గిరీశ్ చంద్ర ముర్మూ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. అక్టోబర్ -25,2019న జమ్మూకశ్మీర్,లఢఖ్, మిజోరాంలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా గిరీష్ చంద్ర ముర్మును,లఢఖ్ లెఫ్టెనెంట్ గవర్నర్ గా శ్రీ రాధాకృష్ణ మథుర్ ని నియమించారు. మిజోరాంమ్‌కు గవర్నర్ గా శ్రీధరన్ పిళ్లైని నియమించారు.
ఈ ఏడాది ఆగస్టు-5,2019న జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్ ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా,లఢఖ్ ను అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా పునర్విభజన చేశారు. ఇవాళ(అక్టోబర్-31,2019)నుంచి జమ్మూకశ్మీర్,లఢఖ్ ప్రాంతాలు కేంద్రపాలిత ప్రాంతాలుగా అధికారంగా అమలులోకి వచ్చాయి.
Srinagar: Girish Chandra Murmu takes oath as the first Lt. Governor of the Union territory of Jammu and Kashmir. The oath was administered by Chief Justice of J&K High Court, Gita Mittal. pic.twitter.com/UtPJHx8TAb
— ANI (@ANI) October 31, 2019