Highway Accident: కారు, ట్రక్కు ఢీ… చిన్నారి సహా 9 మంది మృతి
ముంబై-గోవా హైవేలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, ట్రక్కు పరస్పరం ఢీ కొనడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఓ చిన్నారి, ముగ్గురు మహిళలు ఉన్నారు. మంగావ్ కు సమీపంలో ఇవాళ ఉదయం 5 గంటలకు ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు మీడియాకు తెలిపారు.

ROAD ACCIDENT
Highway Accident: ముంబై-గోవా హైవేలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, ట్రక్కు పరస్పరం ఢీ కొనడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఓ చిన్నారి, ముగ్గురు మహిళలు ఉన్నారు. మంగావ్ కు సమీపంలో ఇవాళ ఉదయం 5 గంటలకు ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు మీడియాకు తెలిపారు.
ట్రక్కు ముంబైకి, కారు రత్నగిరి జిల్లాలోని గుహాగర్ కి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని చెప్పారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయిపోయిందని వివరించారు. ఈ ప్రమాదానికి అధిక వేగమే కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనలో ఎవరికైనా గాయాలయ్యాయా? అన్న వివరాలు తెలియరాలేదు. హైవేపై ట్రాఫిక్ జాం ఏర్పడకుండా పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఘటనాస్థలి నుంచి ఆయా వాహనాలను క్రేన్ల సాయంతో తొలగించారు. ఈ రోడ్డు ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
New Zealand PM: వచ్చే నెల రాజీనామా చేస్తాను: న్యూజిలాండ్ ప్రధాని సంచలన ప్రకటన