బడ్జెట్ 2021-22.. బంగారం ప్రియులకు గుడ్ న్యూస్

బడ్జెట్ 2021-22.. బంగారం ప్రియులకు గుడ్ న్యూస్

Updated On : February 1, 2021 / 4:51 PM IST

good news for gold buyers in budget 2021: యావత్ దేశం ఎంతో ఆసక్తిగా, ఆశగా ఎదురుచూసిన బడ్జెట్ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి సోమవారం(ఫిబ్రవరి 1,2021) బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ లో పలు కీలక ప్రతిపాదనలు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు.

కాగా.. బంగారం, వెండి కొనాలని భావిస్తున్న వారికి ఇది శుభవార్తే. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కీలక ప్రతిపాదన చేసింది. బంగారంపై కస్టమ్ డ్యూటీని తగ్గిస్తామని కేంద్రం వెల్లడించింది. దీని వల్ల పసిడి, వెండి ధరలు తగ్గనున్నాయి.

బంగారంపై ప్రభుత్వం ప్రస్తుతం 12.5 శాతం దిగుమతి సుంకాన్ని వసూలు చేస్తోంది. ఈ సుంకాన్ని 12.5 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గిస్తామని బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కాగా కేంద్ర ప్రభుత్వం 2019 జూలైలో దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచడం వల్ల పుత్తడి, వెండి ధరలు పెరిగాయి. ఇప్పుడు మళ్లీ మోడీ సర్కార్ దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల బంగారం, వెండి ధరలు దిగి రానున్నాయి.

ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధర ఏకంగా 3 శాతం కుప్పకూలింది. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,500 పడిపోయింది. రూ.47,918కు క్షీణించింది. అదే సమయంలో బంగారం ధర గ్లోబల్ మార్కెట్‌లో 1.2 శాతం పెరిగింది.

“బంగారంపై దిగుమతి సుంకాన్ని 7.5 శాతానికి తగ్గించడం సరైన నిర్ణయం. రత్నాలు, ఆభరణాల పరిశ్రమ దీర్ఘకాలిక డిమాండ్‌కు అనుగుణంగా ఉంది. అధిక దిగుమతి సుంకం పరోక్షంగా అక్రమ బంగారు లావాదేవీలను ప్రోత్సహించడమే కాక ప్రభుత్వ ఆదాయాన్ని కూడా తగ్గిస్తుంది. దిగుమతి సుంకం తగ్గింపు వాణిజ్య సమ్మతిని చేస్తుంది. అంతేకాదు, బంగారం అక్రమ లావాదేవీల ట్రాకింగ్ విధానాన్ని మెరుగుపర్చడానికి ఇ-గవర్నెన్స్ వ్యవస్థను బలోపేతం చేయడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. మొత్తం మీద, పారదర్శక వాణిజ్యం ఎల్లప్పుడూ వినియోగదారుల విశ్వాసాన్ని పెంచుతుంది ” అని మలబార్ గోల్డ్ & డైమండ్స్ చైర్మన్ అహమ్మద్ అన్నారు.

ఇకపోతే ఈ బడ్జెట్ లో సామ్యానుడికి ఎలాంటి ఊరట ఇవ్వని కేంద్రం.. భారీ షాక్ మాత్రం ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ పై వ్యవసాయ సెస్సు విధిస్తూ ప్రతిపాదనలు చేసింది. దీంతో చమురు ధరలు భారీగా పెరగనున్నాయి. కాగా, బడ్జెట్‌తో కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. మరికొన్ని వస్తువుల రేట్లు తగ్గనున్నాయి. మరి ధర పెరిగేవి ఏవో.. తగ్గేవి ఏవో ఓసారి చుద్దాం.

ధరలు పెరిగేవి ఇవే..

* ఎలక్ట్రానిక్ వస్తువులు (ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మెషీన్)

* మొబైల్ ఫోన్స్(ఇంపోర్టు డ్యూటీ 2.5 పెంపు)

* చార్జర్లు(దిగుమతి చేసుకునే)

* రత్నాలు

* పెట్రోల్, డీజిల్

* దిగుమతి చేసుకునే కాటన్ దుస్తులు, వంట నూనె, ఆటో విడి భాగాలు

* సోలార్ ఇన్వర్టర్లు

* కార్లు, కార్ల విడి భాగాలు

* లెదర్‌ ఉత్పత్తులు

* స్టీలు స్క్రూలు(10 నుంచి 15 శాతానికి పెంపు)

* రా సిల్స్‌, యాన్‌ సిల్క్‌(10 నుంచి 15 శాతానికి పెంపు)

* ఆల్కహాలిక్‌ బెవెరేజెస్‌

* క్రూడ్‌ పామాయిల్‌

* క్రూడ​ సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌

* ఆపిల్స్‌

* బొగ్గు, లిగ్నైట్‌, పిట్‌

* యూరియా తదితర ఫర్టిలైజర్లు

* బఠాణీలు

* కాబూలీ శనగలు

* బెంగాల్‌ గ్రాం

* పప్పులు

ధరలు తగ్గేవి ఇవే..

* ఐరన్

* స్టీల్

* నైలాన్ క్లాత్స్

* కాపర్ ఐటమ్స్

* ఇన్సూరెన్స్

* షూస్(లెదర్ షూస్ కాదు)

* డ్రై క్లీనింగ్

* వెండి

* బంగారం

* నాప్తా(హైడ్రోకార్బన్‌ లిక్విడ్‌ మిక్చర్‌)

* వ్యవసాయ ఉత్పత్తులు