పీవోకే నుంచి వచ్చిన కుటుంబాలకు…5.5లక్షల ప్యాకేజీకి కేంద్రం ఆమోదం

  • Published By: venkaiahnaidu ,Published On : October 9, 2019 / 12:50 PM IST
పీవోకే నుంచి వచ్చిన కుటుంబాలకు…5.5లక్షల ప్యాకేజీకి కేంద్రం ఆమోదం

Updated On : October 9, 2019 / 12:50 PM IST

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుండి వచ్చి మొదట్లో జమ్మూ కాశ్మీర్ వెలుపల స్థిరపడి ఆ తర్వాత జమ్మూకశ్మీర్ కి మకాం మార్చిన 5,300 మంది నిరాశ్రయులైన కుటుంబాలకు పునరావాసం ప్యాకేజీగా 5.5 లక్షలు ఇచ్చేందుకు ఇవాళ(అక్టోబర్-9,2019)సమావేశమైన కేంద్రకేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ మీటింగ్ ముగిసిన అనంతరం కేంద్రమంత్రి ప్రకాష్ జావదేకర్ మీడియాతో మాట్లాడుతూ…చారిత్రక తప్పిదాన్ని తమ ప్రభుత్వం కరెక్ట్ చేసిందని అన్నారు.

 విభజన తరువాత వేర్వేరు సందర్భాలలో జమ్మూ కాశ్మీర్‌లో స్థిరపడిన పీఓకే కుటుంబాలకు పునరావాసం ప్యాకేజీని ప్రధాని నరేంద్ర మోడీ 2016 లో ప్రకటించిన విషయం తెలిసిందే. పీవోకే నుంచి వచ్చి జమ్మూకశ్మీర్ బయట స్థిరపడిన  కుటుంబాలు తరువాత జమ్మూ కాశ్మీర్‌లో పునరావాసం పొందాయని, ఇప్పుడు అలాంటి 5,300 కుటుంబాలను పునరావాస ప్యాకేజీలో చేర్చామని జావదేకర్ తెలిపారు.