ఇమ్రాన్ మాటలేనా: ఉగ్రవాదంపై.. నయా పాక్.. నయా యాక్షన్ చూపించు
పాకిస్థాన్ భూభాగంలో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను అణిచివేయాలని పొరుగు దేశాలు ఎంతగా హెచ్చరించినా ఇస్లామాబాద్ సీరియస్ గా తీసుకోవడం లేదని భారత ప్రభుత్వం స్ట్రాంగ్ స్టేట్ మెంట్ ఇచ్చింది.

పాకిస్థాన్ భూభాగంలో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను అణిచివేయాలని పొరుగు దేశాలు ఎంతగా హెచ్చరించినా ఇస్లామాబాద్ సీరియస్ గా తీసుకోవడం లేదని భారత ప్రభుత్వం స్ట్రాంగ్ స్టేట్ మెంట్ ఇచ్చింది.
పాకిస్థాన్ భూభాగంలో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను అణిచివేయాలని పొరుగు దేశాలు ఎంతగా హెచ్చరించినా ఇస్లామాబాద్ సీరియస్ గా తీసుకోవడం లేదని భారత ప్రభుత్వం స్ట్రాంగ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. దేశసరిహద్దులో ఉగ్రవాదుల దాడి ఘటన తర్వాత కూడా పాక్ ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని మండిపడింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అణిచివేసి తమ విశ్వసనీయతను నిరూపించుకోవాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి రావేశ్ కుమార్ తెలిపారు.
Read Also : 22 ఉగ్రవాద శిబిరాలు నడుస్తున్నాయి: పాక్ బండారం బట్టబయలు
శనివారం (మార్చి 9, 2019) ఉదయం మీడియా సమావేశంలో రావేశ్ మాట్లాడుతూ.. ‘దేశ సరిహద్దుల్లో ఉగ్రవాద సంస్థలపై కొత్త పాకిస్థాన్.. కొత్తగా ఆలోచించి.. కొత్త యాక్షన్ తీసుకోవాలి’ అని అన్నారు. పాక్ భూభాగంలో ఉగ్రవాద సంస్థలను అనుమతించేది లేదని శుక్రవారం పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాద సంస్థల ఏరివేత మొదలయ్యాక ఇక ఏ ఉగ్రవాద సంస్థ పాక్ భూభాగాల్లోకి అడుగుపెట్టనియ్యమని ప్రకటించారు.
అంతేకాదు.. పాక్ లోని నిషేధిత ఉగ్రవాద సంస్థలు నడుపుతున్న రిలీజియస్ స్కూళ్లను మూసివేయించామని, 120 మందికి పైగా ఉగ్రసంస్థ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్టు ఇమ్రాన్ తెలిపారు. గతంలో కూడా పాకిస్థాన్ ప్రభుత్వం తమ భూభాగంలోని ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోంటామని ప్రగల్భాలు పలికింది. అయినప్పటికీ ఉగ్రవాద సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించలేదని కుమార్ విమర్శించారు. ఉగ్రవాద సంస్థలను అణిచివేస్తామని పాక్ చెబుతూ వస్తోందని, మాటల్లో కాదు.. చేతల్లో పాక్ చేసి తమ విశ్వసనీయతను నిరూపించుకోవాలని రావేశ్ కుమార్ తెలిపారు.
Read Also : 16 నెలల తర్వాత : లండన్‌లో నీరవ్ మోడీ ఆచూకీ లభ్యం