Govt Exempts Import Duty : ప్రత్యేక వైద్య అవసరాల కోసం అవసరమైన మందులు, ఆహారంపై దిగుమతి సుంకం మినహాయింపు

అరుదైన వ్యాధుల కోసం జాతీయ పాలసీ 2021 కింద జాబితాలో చేర్చబడిన అన్ని అరుదైన వ్యాధుల చికిత్స కోసం వ్యక్తిగత ఉపయోగం కోసం దిగుమతి చేసుకున్న అన్ని మందులు, ప్రత్యేక వైద్య ప్రయోజనాల కోసం ఉపయోగించే ఆహారంపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుండి పూర్తి మినహాయింపును ఆర్ధిక మంత్రిత్వశాఖ ఇవ్వనుంది.

Govt Exempts Import Duty : ప్రత్యేక వైద్య అవసరాల కోసం అవసరమైన మందులు, ఆహారంపై దిగుమతి సుంకం మినహాయింపు

medicine

Updated On : March 30, 2023 / 3:53 PM IST

Govt Exempts Import Duty : అరుదైన వ్యాధుల చికిత్స కోసం వ్యక్తిగత ఉపయోగం కోసం, ప్రత్యేక వైద్య ప్రయోజనాల కోసం దిగుమతి చేసుకునే అన్ని మందులు మరియు ఆహారంపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం మినహాయించింది. అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మందులు, ఔషధాల కోసం కస్టమ్స్ సుంకం ఉపశమనం కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞాపనలు వచ్చిన నేపద్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆమేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. దిగుమతి సుంకం మినహాయింపు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది.

READ ALSO : Egg Yolk : గుడ్డులోని పచ్చసొన తీసుకోవటం ఆరోగ్యానికి హానికరమా? నిపుణులు ఏంచెబుతున్నారంటే..

అలాగే, వివిధ క్యాన్సర్‌ల చికిత్సలో ఉపయోగించే పెంబ్రోలిజుమాబ్ (కీట్రుడా)కు ప్రభుత్వం ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుండి మినహాయింపు ఇచ్చింది. ఇప్పటి వరకు మందులు, ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 10 శాతంగా , అయితే కొన్ని వర్గాల ప్రాణాలను రక్షించే మందులు/వ్యాక్సిన్‌లు రాయితీ రేటు 5 శాతం ఉంది. అరుదైన వ్యాధుల కోసం జాతీయ పాలసీ 2021 కింద జాబితాలో చేర్చబడిన అన్ని అరుదైన వ్యాధుల చికిత్స కోసం వ్యక్తిగత ఉపయోగం కోసం దిగుమతి చేసుకున్న అన్ని మందులు, ప్రత్యేక వైద్య ప్రయోజనాల కోసం ఉపయోగించే ఆహారంపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుండి పూర్తి మినహాయింపును ఆర్ధిక మంత్రిత్వశాఖ ఇవ్వనుంది.

వెన్నెముక కండరాల క్షీణత, కండరాల బలహీనత చికిత్స కోసం ఇప్పటికే కొన్నిరకాల ఔషధాలకు మినహాయింపులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 10 కిలోల బరువున్న పిల్లలకు, కొన్ని అరుదైన వ్యాధుల చికిత్సకు వార్షిక ఖర్చు, సంవత్సరానికి 10 లక్షల నుండి 1 కోటి కంటే ఎక్కువ అవుతుంది. చికిత్స జీవితకాలం ఉండటం ఔషధ మోతాదు ఖర్చు పెరుగుతుందని అంచనా వేసిన కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రోగులకు ఉపశమనం లభించనుంది.

READ ALSO : Kidney Stones : కిడ్నీల్లో రాళ్ల సమస్య రాకుండా ఉండాలంటే వీటికి దూరంగా ఉండటమే మంచిది!

అయితే కస్టమ్స్ సుంకం నుండి పూర్తి స్ధాయిలో మినహాయింపు పొందాలంటే వ్యక్తిగత దిగుమతిదారు కేంద్ర, లేదా రాష్ట్ర డైరెక్టర్ హెల్త్ సర్వీసర్ నుండి జిల్లా వైద్య అధికారి/జిల్లా సివిల్ సర్జన్ నుండి సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.