ఆ రోజే పాకిస్తాన్ పై బాంబుల వర్షం కురిసేది : IAF మాజీ చీఫ్

ఐఏఎఫ్(ఇండియన్ ఎయిర్ ఫోర్స్) మాజీ చీఫ్ బీఎస్ ధనోవా కీలక వ్యాఖ్యలు చేశారు. 26/11 దాడుల తర్వాత పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయాలని

  • Published By: veegamteam ,Published On : December 28, 2019 / 04:42 AM IST
ఆ రోజే పాకిస్తాన్ పై బాంబుల వర్షం కురిసేది : IAF మాజీ చీఫ్

Updated On : December 28, 2019 / 4:42 AM IST

ఐఏఎఫ్(ఇండియన్ ఎయిర్ ఫోర్స్) మాజీ చీఫ్ బీఎస్ ధనోవా కీలక వ్యాఖ్యలు చేశారు. 26/11 దాడుల తర్వాత పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయాలని

ఐఏఎఫ్(ఇండియన్ ఎయిర్ ఫోర్స్) మాజీ చీఫ్ బీఎస్ ధనోవా కీలక వ్యాఖ్యలు చేశారు. 26/11 దాడుల తర్వాత పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయాలని అనుకున్నామని, కానీ కేంద్రం నుంచి పర్మిషన్ రాలేదని చెప్పారు. నాడు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే.. భారత వాయు సేన.. పాక్ భూభాగంలోని టెర్రరిస్టు క్యాంపులపై దాడి చేసేదన్నారు. ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసే వాళ్లమన్నారు. ముంబైలోని వీజేటీఐ(Veermata Jijabai Technological Institute) వార్షిక వేడుకల్లో ధనోవా పాల్గొన్నారు. విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గతాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. 

”పాకిస్తాన్ భూభాగంలో టెర్రరిస్టుల క్యాంపులు ఎక్కడ ఉన్నాయో మాకు తెలుసు. దాడి చేయడానికి రెడీగా ఉన్నాము. కానీ దాడుల అంశం రాజకీయ నిర్ణయం. అటాక్స్ చేయాలా వద్దా అనే దానికి పర్మిషన్ అవసరం” అని రిటైర్డ్ ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా చెప్పారు. డిసెంబర్ 31, 2016 నుంచి సెప్టెంబర్ 30, 2019 వరకు ఎయిర్ ఫోర్స్ చీఫ్ గా ధనోవా పని చేశారు.

అసలు.. 2001లో పార్లమెంటుపై దాడి జరిగాక వాయుసేన ద్వారా పాకిస్తాన్ పై దాడులు చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని కేంద్రాన్ని ఐఏఎఫ్ కోరిందని… అయితే కేంద్రం నుంచి పర్మిషన్ రాలేదని ధనోవా వెల్లడించారు.

Also Read : దిశ నిందితుడి ఇంట్లో తీవ్ర విషాదం : చావు బతుకుల మధ్య తండ్రి